బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
Maria Susairaj Case: ఓ నటి అవకాశాల పేరుతో దగ్గరై, 26 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ను 300 ముక్కలుగా నరికి చంపింది. తరువాత బాయ్ ఫ్రెండ్ తో కలిసి శవం ముందే దారుణమైన పని... చివరకు పోలీసులకు ఎలా దొరికిందో తెలుసా?

సినిమా పరిశ్రమ వెలుగు జిలుగులతో ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అయితే ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైనది కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. 2008లో ముంబై నగరంతో పాటు సినిమా పరిశ్రమను, మూవీ లవర్స్ ను దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక అత్యంత విషాదకరమైన ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ వింటే ఒళ్లు గగుర్పాటుకు గురికావాల్సిందే. ఓ సౌత్ హీరోయిన్ ఇద్దరు ప్రియులతో ప్రేమాయణం నడిపిస్తూనే, మరో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ ప్రియుడిని ఏసేసి, ఏకంగా 300 ముక్కలుగా కట్ చేసి తగలబెట్టింది. ఆ నటి మరెవరో కాదు కన్నడ నటి మరియా మోనికా సూసైరాజ్. ఆమె ప్రియుడు లెఫ్టినెంట్ ఎమిలే జెరోమ్ మాథ్యూ. ఇక బాధితుడు 26 ఏళ్ల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్.
ఇండస్ట్రీలోకి మోనికా ఎంట్రీ
మరియా మోనికా సూసైరాజ్ మైసూరులోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమెకు పాటలు పాడడం, డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె తండ్రి ఒక నిర్మాణ సంస్థలో పనిచేసేవాడు. మామ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈ నటి చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలుకనేది. కానీ ఆమె కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. పైగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో మరియా మైసూర్ లోని తన ఫ్యామిలీని వదిలేసి బెంగళూరుకు వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని చిన్న చిన్న పాత్రలు చేసిన తర్వాత 2002లో రిలీజ్ అయిన కన్నడ సినిమా 'జూట్'లో హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఈ మూవీలో ఆమె నటకు ప్రశంసలు దక్కినప్పటికీ, కమర్షియల్ గా పరాజయం పాలయ్యింది. దీంతో అవకాశాలు రాలేదు. చేసేదేం లేక చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకు వచ్చేది.
నీరజ్ తో పరిచయం అక్కడే...
ముంబైకి వెళ్లిన మరియా మోనికా సూసైరాజ్ స్టార్ హీరోయిన్ కావాలని ఆశపడింది. అనుకున్నట్టుగానే తరచుగా ముంబైకి ఆడిషన్ల కోసం వెళ్ళేది. ఆ టైంలోనే నీరజ్ గ్రోవర్ ఏక్తా కపూర్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ తో కలిసి పని చేస్తున్నాడు. 2008లో ఆడిషన్ కోసం నీరజ్ ను కలిసింది మరియా. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఆ రిలేషన్ కాస్తా సాన్నిహిత్యానికి దారితీసింది. అయితే అప్పటికే మైసూర్ లోని పూణేలో భారత ఆర్మీలో పని చేస్తున్న ఆమె మాథ్యూతో రిలేషన్షిప్‌లో ఉంది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ కావాలనే కల వల్ల నీరజ్ కు కూడా దగ్గరైంది. మాథ్యూకి మాత్రం కేవలం ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఎట్టకేలకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో మోనికా ముంబైకి షిఫ్ట్ కావాలని ఫిక్స్ అయింది. ముందు ఆమె నీరజ్ ఫ్లాట్లోనే అతనితో వారం పాటు కలిసి ఉంది. కానీ ఆ తర్వాత మాథ్యూ గొడవను తట్టుకోలేక మరో కొత్త అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయింది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియక సన్నిహితంగా మెలుగుతున్న నీరజ్ రూమ్ షిఫ్టింగ్ లో హెల్ప్ చేయడానికి ఆమెతో పాటు అక్కడికి వెళ్ళాడు. ఆ టైంలో మాథ్యూ ఫోన్ చేయడం, నీరజ్ వాయిస్ ఫోన్లో వినపడడం, ఉదయాన్నే ఊహించని విధంగా మోనికా ఫ్లాట్ ముందు మాథ్యూ ప్రత్యక్షమవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో ఆమె ఒక్కసారిగా కంగారు పడినప్పటికీ ఆగ్రహంతో ఊగిపోతున్న మాథ్యూను ఆపలేకపోయింది. మోనికా బెడ్ పై నీరజ్ పడుకుని ఉండడం చూసి, తట్టుకోలేక కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి శవం ముందే శారీరకంగా కలిశారు. ఇంట్లో రక్తపు మరకలు లేకుండా క్లీన్ చేసి, అతన్ని 300 ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి, దూరంగా తీసుకెళ్లి కాల్చారు.
ఆ ఒక్క తప్పుతో దొరికిపోయారు
కానీ ఆ టెన్షన్లో మోనికా చేసిన తప్పేంటంటే నీరజ్ ఫోన్ ని ఆమె జేబులోనే పెట్టుకొని మర్చిపోవడం. ఈ తతంగం అంతా జరిగాక నీరజ్ సన్నిహితులు ఫోన్ చేయడంతో మారియా ఫోన్ ఎత్తి అతను నిన్న రాత్రి తన ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయాడని, ఫోన్ ఇక్కడే మర్చిపోయాడని చెప్పుకుంటూ వచ్చింది. చివరికి నీరజ్ సన్నిహితులతో కలిసి ఏమి ఎరగనట్టుగా పోలీసుల దగ్గరికి వెళ్లి నీరజ్ మిస్సింగ్ అంటూ కంప్లైంట్ ఇచ్చింది. ఇక అన్ని విధాలుగా దర్యాప్తు చేసిన పోలీసుల దృష్టి ఎట్టకేలకు మోనికాపై పడింది. మొబైల్ నెట్వర్క్ టవర్ ద్వారా నీరజ్ ఉన్న ప్రదేశాన్ని పోలీసులు కనిపెట్టారు. అంతే కాకుండా మోనికా - మ్యాథ్యూ మధ్య మే 7 నుంచి మే 8 మధ్య 1000కి పైగా కాల్స్ ఉండటం అనుమానాలను మరింతగా పెంచింది. అలాగే మోనికా, ఆమె ప్రియుడు బరువైన వస్తువులను సంచుల్లో మోసుకెళ్లడం చూసానని వాచ్ మెన్ చెప్పాడు. చివరికి పోలీసులు మొబైల్ నెట్వర్క్ టవర్ ద్వారా నీరజ్ చివరగా ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టారు. ఆమె నోటి నుంచి నిజాన్ని కక్కించగలిగారు.
మొత్తానికి మారియా హత్య చేయలేదు, కేవలం సాక్షాలను నాశనం చేసింది కాబట్టి ఆమెకు మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించారు. కానీ మాథ్యూకు మాత్రం హత్య చేసినందుకు 10 ఏళ్లు, సాక్ష్యాలను నాశనం చేసినందుకు మూడు సంవత్సరాలు జైలు శిక్షను విధించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

