SRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP Desam
సన్ రైజర్స్ కి హైదరాబాద్ టీమ్ లో వాళ్లంతా టెర్రరిస్టులా. ఇప్పుడు ఈ నినాదమే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటీ క్రికెటర్లను టెర్రరిస్టులతో పోల్చటమేంటీ అంటే వాళ్ల ఉద్దేశ్యం సన్ రైజర్స్ ఆటగాళ్ల బ్రూటాలీటిని చెప్పటమే. ప్రత్యర్థి ఎవరిని చూడకుండా హైదరాబాద్ పిచ్ లో మ్యాచ్ అంటే చాలు టాస్ గెలవటం బ్యాటింగ్ తీసుకోవటం ఆ తర్వాత ఊచకోత కోయటం. ఇదే పరిపాటిగా మారిపోయింది సన్ రైజర్స్ కి. అంతెందుకు ఈ ఐపీఎల్ లో టాప్ 3 హయ్యెస్ట్ టీమ్ స్కోర్సు మూడు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మీదున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్లెంతలా అప్పోనెంట్స్ మీద విరుచుకుపడుతున్నారో. అది కూడా ఈ మూడు హయ్యెస్ట్ టీమ్ స్కోర్లు వచ్చింది ఏడాది కాలంలోనే...గతేడాది ముంబై మీద హైదరాబాద్ లో 277 పరుగులు చేసి ఆర్సీబీ పేరు మీదున్న హయ్యెస్ట్ టీమ్ స్కోరు రికార్డు బ్రేక్ చేసిన సన్ రైజర్స్ మళ్లీ తనే ఆర్సీబీ మీద బెంగుళూరు చిన్న స్వామిలో 287పరుగులు చేసి తన రికార్డును తనే మళ్లీ బ్రేక్ చేసింది. మళ్లీ ఏడాది తర్వాత ఈసారి ఐపీఎల్లో నిన్న హైదరాబాద్ లో రాజస్థాన్ రాయల్స్ మీద 286పరుగులు చేసింది హైదరాబాద్ . పాపం కెప్టెన్ రియాన్ పరాగ్. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో బేలగా చూస్తుండిపోయాడు. ఎంత మంది బౌలర్లను మార్చినా ఎన్ని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ సెట్ చేసినా బాల్ ను స్టాండ్స్ లోకి పంపటమే లక్ష్యంగా SRH ఆటగాళ్లు ఆడుతుంటే ఇక ఏ కెప్టెన్ కైనా ప్లాన్ బీ, ప్లాన్ సీలు ఏముంటాయి. చేష్టలుడిగి జరిగే దండయాత్రను చూడటం తప్ప. తృటిలో మిస్సైంది కానీ లేదంటే నిన్న హైదరాబాద్ ఆడిన ఆటకు 300 పరుగుల రికార్డును బద్ధలు కొట్టేస్తుంది అనుకున్నారు. వాస్తవానికి ఈ సీజన్ లో ఏదో ఒక మ్యాచ్ లో సన్ రైజర్స్ కొడుతుందిలే అనుకున్నారు వాళ్లు ఫస్ట్ మ్యాచ్ నుంచి విరుచుకపడుతుండటం చూస్తుంటే ఈ సీజన్ లో 300 పరుగుల రికార్డును అఛీవ్ చేయటం పక్కా అని అర్థం అవుతోంది. అందుకే మిగిలిన టీమ్ వాళ్లు ప్లేయర్స్ ఏమో కానీ సన్ రైజర్స్ ఆటగాళ్లు మాత్రం టెర్రరిస్టులు అంటూ ఈ ఫోటోలతో ఆరెంజ్ ఆర్మీని తమ ఆటగాళ్లకు ఎలివేషన్ ఇస్తుంది.





















