నల్లగా ఉందని అవమానించారు... ఆవిడ ప్లేస్‌లో కుక్క... తెలుగు స్టార్‌కు రెండో భార్యగా... ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి!
Actress : నల్లగా ఉన్నావంటూ ఘోర అవమానాలు ఎదుర్కొన్న ఓ నటి ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కే సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అలాగే ఈ బ్యూటీ తెలుగు స్టార్ హీరోకి రెండవ భార్యగా మారింది. ఆమె ఎవరంటే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఓ బ్యూటీ గతంలో ఘోరమైన అవమానాలను ఎదుర్కొంది. ముఖ్యంగా కలర్ కారణంగా "నువ్వు కనీసం బ్యాగ్రౌండ్ మోడల్ లో కూడా పనికిరావు" అంటూ మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పారట. ఇలాంటి అవమానాలు అన్నింటినీ ఎదుర్కొని చివరకు ఈ హీరోయిన్ హాలీవుడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. అంతే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోకి సెకండ్ భార్యగా మారి వందల కోట్ల ఆస్తులకు వారసురాలిగా మారింది. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ.
కెరీర్ మొదట్లో ఘోరమైన అవమానాలు
గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తాను కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. ముంబైలో డిగ్రీ చేసే టైంలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. అయితే మోడలింగ్ లోకి అడుగు పెట్టిన మొదట్లో తాను కలర్ డిస్క్రిమినేషన్ కు గురయ్యానంటూ ఎమోషనల్ అయింది. ఓ షాంపూ యాడ్ చేయడానికి ఆడిషన్స్ కోసం వెళితే "నువ్వు నల్లగా ఉన్నావ్. కనీసం బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు" అంటూ మొహం మీదే చెప్పారట. అంతేకాకుండా తన స్థానంలో ఓ కుక్కని పెట్టి యాడ్ షూట్ చేశారని చెప్పి గుర్తు చేసుకుంది శోభిత.
అయితే ఎట్టకేలకు తనకు సక్సెస్ వచ్చిన తర్వాత అదే కంపెనీ వచ్చి ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్ హీరోయిన్ తో పాటు యాడ్ చేయమని, అలాగే తమ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని రిక్వెస్ట్ చేయడం సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చింది. అయితే కెరీర్ మొదట్లో ఎన్ని అవమానాలు ఎదురైనా సరే పట్టించుకోకుండా పట్టుదలగా ప్రయత్నించి మొత్తానికి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2013 పోటీలో ఫైనలిస్ట్ ఆయన శోభిత దాదాపు 100 ఆడిషన్లు చేశాక 2016లో అనురాగ కశ్యప్ 'రామన్ రాఘవన్ 2.0' అనే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
'మంకీ మ్యాన్'తో హాలీవుడ్ హీరోయిన్ గా
టాలీవుడ్లో అడవి శేష్ 'గూఢచారి' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. అలాగే పొన్నియన్ సెల్వన్, మేజర్, కురూప్ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతేకాకుండా 'మంకీ మ్యాన్' అనే అమెరికన్ సినిమాలో సైతం నటించి హాలీవుడ్ సినిమాలు కూడా చేయగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఆమె చేసిన 'మేడిన్ హెవెన్' తదితర వెబ్ సిరీస్ లు ఎంత స్పెషల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం శోభిత ఒక్కో సినిమాకు కోటి రూపాయలు వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. నాగచైతన్యకి దాదాపు 150 కోట్ల ఆస్తిపాస్తులు ఉండగా, శోభిత ఫ్యామిలీకి కూడా భారీగానే ఆస్తులున్నాయి. అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఏకంగా 10 కోట్ల దాకా సంపాదించిందట. ఇక నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకోవడంతో ఆ తర్వాత శోభితాను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

