CM Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం అవసరమా ? సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తిరుమల దర్శనాలకు TTD, ఏపీ ప్రభుత్వాన్ని ప్రతీసారి అడుక్కోవడం అవసరమా ? అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

Revanth Reddy on TTD recommendation letters | హైదరాబాద్: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులు అనుమతించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనాల గురించి టీటీడీ అధికారులను, ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిసారి అడుక్కోవడం ఏంటి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు టీటీడీ (TTD) ఉన్నట్లయితే, తెలంగాణకు వైటీడీ (Yadagirigutta Temple) లేదా? భద్రాచలంలో రాములోరి ఆలయం లేదా? రాష్ట్రంలో శివాలయాలు తక్కువ ఉన్నాయా అని కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం కోసం బతిమాలికొనే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి తిరుమల పర్యటనకు వెళ్తున్న రోజే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. శుక్రవారం నాడు తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
కాంగ్రెస్ పై ఎందుకు కోపంగా ఉన్నారా..
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది తాము 15 నెలల్లో చేసి చూపించాం అన్నారు. కేవలం 10 నెలల్లో 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. కొన్ని రోజుల్లో గ్రూప్ 1,2, 3 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. అయితే హామీలు నెరవేరుస్తున్నందుకు కోపంగా ఉన్నారా? ఉద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నందుకు రేవంత్ రెడ్డి పై కోపంగా ఉన్నారా అని వ్యాఖ్యానించారు. ప్రయాణం కల్పించినందుకా? గృహ జ్యోతి పెద్ద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా? ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చినందుకు నాపై కోపం ఉంటుందా అని రేవంత్ అన్నారు.
అద్భుతమైన సంస్కృతిక వారసత్వం
తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో ఎదురవుతున్న అవమానాలపై ఈ సందర్భంగా స్పందించారు. తిరుమలకు వెళ్లి దర్శనాల గురించి ప్రతిసారి బతిమాలడం అవసరమా అన్నారు. ఏపీకి టీటీడీ అంటే, ఇక్కడ వైటీడీ లేదా. భద్రాచలంలో రాముడు ఉన్నాడు, రాష్ట్రంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. తిరుమల కు వెళ్లి ఏపీ ప్రభుత్వాన్ని టిటిడి అధికారు లను బ్రతిమాలికొనే బదులు రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించాలి. మనకు అద్భుతమైన సంస్కృతిక వారసత్వం ఉంది. అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాము అన్నారు. జూనియర్స్ పోటీలు హైదరాబాదులో జరగబోతున్నాయి. సిలికాన్ వ్యాలీ తెలంగాణ వైపు చూస్తోందని, మెక్ డొనాల్డ్ కంపెనీ హైదరాబాద్‌కు వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

