Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
భారత్, న్యూజీలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సొంతగడ్డపై కివీస్ ను ఎదుర్కోవడానికి భారత్ రెడీ అవుతుంది. అయితే ఈ సిరీస్ కోసం భారత జట్టును సెలెక్టర్లు త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ టీమ్ కోసం సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకోబోతునట్టుగా తెలుస్తుంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant ) ను తప్పించేందుకు సెలెక్టర్లు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతేడాది సొంతగడ్డపై కివీస్ చేతిలో 0-3 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఈ వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఈ సిరీస్ కోసం వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా రిషబ్ పంత్ ను తప్పించి ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) ను సెలెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇషాన్ కు ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సెలెక్టర్లు. రిషబ్ పంత్ చివరి సారిగా 2024 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డేలో ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో చోటు దక్కినప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.





















