అన్వేషించండి

iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!

ibomma Ravi Case | ఐ-బొమ్మ రవి కేసులో కొత్త కోణం వెలుగు చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రూమ్‌మేట్ పేరుతో ఇమంది రవి ఐడెండెటీ చోరీ చేశాడు. మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు.

Ibomma Ravi Case Latest News | హైదరాబాద్: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను వెలికితీశారు. విచారణలో భాగంగా రవి తన గుర్తింపును దాచిపెట్టేందుకు ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు గుర్తించారు. గతంలో పోలీసుల ప్రశ్నకు సమాధానంగా ప్రహ్లాద్ తన రూమ్‌మేట్ అని రవి చెప్పాడు. అయితే ఈ వ్యవహారంపై స్పష్టత కోసం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అసలైన ప్రహ్లాద్‌ను పోలీసులు పిలిపించి, రవి సమక్షంలోనే ముఖాముఖి విచారణ జరిపారు. 

ఈ విచారణలో ప్రహ్లాద్ పోలీసులకు వాంగ్మూలం ఇస్తూ, తనకు ఇమంది రవి ఎవరో తెలియదని, తన పేరు మీద అతను నకిలీ పత్రాలు సృష్టించాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపినట్లు సమాచారం. ప్రహ్లాద్‌కు తెలియకుండానే అతని వ్యక్తిగత పత్రాలను ఇమంది రవి దొంగిలించి, వాటిని తన నేరపూరిత కార్యకలాపాలకు వినియోగించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

గుర్తింపు చోరీ కేసులు సైతం..
కేవలం పైరసీకి సంబంధించిన నేరాలే కాకుండా, ఫోర్జరీ, గుర్తింపు దొంగతనానికి (Identity Theft) పాల్పడినట్లు రవిపై మరిన్ని సెక్షన్ల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రవి విచారణ ముగింపు దశకు చేరుకుంది. సోమవారంతో అతని కస్టడీ గడువు ముగియనున్న క్రమంలో పోలీసులు సేకరించిన మరిన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించనున్నారు.

గుర్తింపు దొంగతనం.. జాగ్రత్తలు
డిజిటల్ యుగంలో ఇమంది రవి వంటి వ్యక్తులు ఇతరుల పత్రాలను దొంగిలించి నేరాలకు పాల్పడటం తీవ్రమైన సమస్యగా మారింది. దీనిని 'ఐడెంటిటీ థెఫ్ట్' అని పిలుస్తారు. ఒక వ్యక్తికి తెలియకుండా వారి పేరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు లేదా బ్యాంకు వివరాలను ఉపయోగించి ఆర్థిక లాభం పొందడం లేదా నేరాలు చేయడాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఐటీ చట్టంతో పాటు భారత శిక్షాస్మృతి (BNS) ప్రకారం ఇది కఠినమైన శిక్షలు పడే నేరం కిందకువస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ ఆధార్, పాన్ కార్డు ఫోటో కాపీలను ఎక్కడైనా ఇచ్చేటప్పుడు, వాటిపై ఏ కారణం కోసం ఇస్తున్నారో స్పష్టంగా రాసి (For KYC purpose only) సంతకం చేయాలి. 
వ్యక్తిగత పత్రాలను భౌతికంగా వెంట తీసుకెళ్లకుండా ప్రభుత్వం అందించే 'డిజిలాకర్' (DigiLocker) వంటి యాప్‌లను ఉపయోగించాలి.

మీ పేరు మీద మీకు తెలియకుండా ఎవరైనా లోన్లు లేదా సిమ్ కార్డులు తీసుకున్నారా అని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు సిబిల్ (CIBIL) రిపోర్ట్ లేదా 'సంచార్ సాథీ' పోర్టల్‌ను తనిఖీ చేయాలి.

సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం ద్వారా మీ డేటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. కనుక అపరిచిత వ్యక్తులు పంపిన లింకులను గుడ్డిగా నమ్మ క్లిక్ చేయకపోవడమే మంచిది. అధికారిక వెబ్‌సైట్ లలో సమాచారం క్రాస్ చెక్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Unique Mercantile Fraud: అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు.. 'యూనిక్' కంపెనీ ఎండీ రాజ్ కుమార్ అరెస్ట్
అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget