అన్వేషించండి

Ibomma Ravi case: ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ - కస్టడీకి తీసుకోని పోలీసులు- మళ్లీ కొత్త పిటిషన్

Ibomma case: ఐబొమ్మ రవి కేసులో పోలీసులు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరో కేసులోమాూాడు రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చినప్పటికి సరిపోదని మరో పిటిషన్ వేశారు.

Police file new petition in Ibomma Ravi case: సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు మూడోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు మూడు రోజుల అనుమతి ఇచ్చినప్పటికీ ఆశ్చర్యకరంగా, పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోకుండా మరో పిటిషన్ వేశారు. మూడు రోజులు సరిపోదని మరికొద్ది రోజుల పాటు అవసరం అని పిటిషన్ వేసారు. ఈ  యూటర్న్ ' వెనుక రవి బెయిల్ పొందకుండా చేయాలనే వ్యూహమే ఉందని అతని తరపు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఐబొమ్మ, బప్పం టీవీ వంటి అక్రమ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుగు సినిమాలను పైరసీ చేసిన ఆరోపణలపై రవిని అక్టోబర్ 17న హైదరాబాద్ కుకట్‌పల్లిలో అరెస్టు చేశారు. ఇప్పటివరకు రెండుసార్లు  కస్టడీకి తీసుకుని పోలీసులు అతన్ని ప్రశ్నించారు. మొత్తం ఎనిమిది రోజుల ప్రశ్నల సమయంలో రవి తన సహచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పైరసీ , బెట్టింగ్ ప్రమోషన్‌కు స్వయంగా ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే, టెక్నికల్ అంశాలతో ముడిపడిన ఈ కేసులో బలమైన ఆధారాలు లభించాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు.

పోలీసులు మూడోసారి కస్టడీ అనుమతి పొందినా, రవిని జైలు నుంచి తీసుకెళ్లకుండా మరో పిటిషన్ వేయడం విచిత్రమని అతని తరపు లాయర్లు అంటున్నారు. కస్టడీకి అనుమతి వచ్చినా  మరిన్ని రోజుల అవసరం అని  కస్టడీకి తీసుకోకపోవడం బెయిల్ విచారణను ఆలస్యం చేయాలనే ప్రయత్నమేనని భావిస్తున్నారు.  ఈ పైరసీ కేసు కూడా టెలిగ్రామ్‌లో కొనుగోలు చేసిన మూలాలపై ఆధారపడి ఉంది.   రవి పైరసీ చేయలేదని ఆయన టెలిగ్రామ్‌లోనే సినిమాలు కొన్నాడని పోలీసులు కూడా చెబుతున్నారు.   అందుకే ఎక్కువ కాలం జైలులో ఉంచాలనే ఉద్దేశంతో పోలీసులు ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని అంటున్నారు.                        

ఇప్పటికే ఇమ్మడి రవి లాయర్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  కోర్టు మూడు రోజుల కస్టడీ అనుమతి ఇచ్చిన సమయంలోనే, కస్టడీ పూర్తయిన తర్వాత రవి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. ఈ అనుమతి మేరకు పోలీసులు రవిని శనివారం  నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నించాల్సి ఉంది. అయితే, పోలీసులు ఈ అవకాశాన్ని వాడుకోకుండా, మరో నాలుగు కేసుల్లో అదనపు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రవి నడిపిన పైరసీ నెట్‌వర్క్ పెద్దది. 65కి పైగా మిర్రర్ సైట్‌లు, హై-డెఫినిషన్ ప్రైవేట్ లీక్‌లు ఉన్నాయి. పూర్తి విచారణ కోసం మరిన్ని రోజులు అవసరం అని పోలీసులు చెబుతున్నారు.                 
 
ఈ కేసుపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు నిలబడదని కొంత మంది.. ఆధారాలు చూపించలేరని మరికొంత మంది చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం సీరియస్ గా  దర్యాప్తు చేస్తున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Harish Rao: పల్నాడు స్కీమ్‌ ఆపుతానని రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు? చంద్రబాబుకు గురుదక్షిణ కోసమా?: హరీష్ రావు
పల్నాడు స్కీమ్‌ ఆపుతానని రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు? చంద్రబాబుకు గురుదక్షిణ కోసమా?: హరీష్ రావు
Kamble Mukesh Kumar: కాంబ్లె ముకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు.. హీరో సుమన్ చేతుల మీదుగా నియామక పత్రం, ఎవరీయన
కాంబ్లె ముకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు.. హీరో సుమన్ చేతుల మీదుగా నియామక పత్రం, ఎవరీయన
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Embed widget