Rohit Sharma Records: ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
Year Ender 2025 Rohit sharma Records | రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఈ ఏడాది రోహిత్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. 50 రికార్డుల జాబితా చూడండి.

రోహిత్ శర్మకు 2025 సంవత్సరం అద్భుతంగా కలిసొచ్చింది. అతడి కెప్టెన్సీలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై రోహిత్ 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందుకుగానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఏడాది రోహిత్ సాధించిన 50 పెద్ద రికార్డులను చూడండి.
1. అత్యధిక వన్డే సిక్స్‌లు
రోహిత్ శర్మ ఈ ఏడాది షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ గత 10 సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఖాతాలో ప్రస్తుతం 355 వన్డే సిక్స్‌లు ఉన్నాయి. అఫ్రిది 351 సిక్స్‌లు కొట్టాడు.
2. SENA దేశాలలో అత్యధిక వన్డే సెంచరీలు
రోహిత్ శర్మ సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను మొత్తం 14 వన్డే సెంచరీలు సాధించాడు.
3. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ (15,933)
4. ఓపెనర్‌గా భారత్ తరపున సంయుక్తంగా అత్యధిక సెంచరీలు (45). సచిన్ సైతం ఓపెనర్‌గా ఇదే రికార్డ్.
5. కెప్టెన్‌గా ICC టోర్నమెంట్‌లలో సంయుక్తంగా అత్యధిక M.O.M. (4)
6. భారత్ తరపున సంయుక్తంగా అత్యధిక (4) ICC ట్రోఫీలు గెలుచుకున్నాడు రోహిత్ శర్మ
7. కెప్టెన్‌గా ICC వన్డేల్లో అత్యధిక గెలుపు శాతం (93.8)
8. కెప్టెన్‌గా ODIల్లో భారత్ తరపున అత్యధిక సిక్స్‌లు (126)
9. ODIల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న అధిక వయసున్న భారతీయుడు (38 ఏళ్లు)
10. ODIల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అధిక వయసున్న భారత ప్లేయర్ (38)
11. విదేశీ బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు (6) చేసిన క్రికెటర్
12. ఆస్ట్రేలియాలో అత్యధిక ODI పరుగులు చేసిన భారతీయుడు (1530)
13. ఆస్ట్రేలియాలో ODI సెంచరీ చేసిన అధిక వయసున్న ఆసియా క్రికెటర్
14. విదేశాల్లో ODI సెంచరీ చేసిన అధిక వయసున్న భారతీయుడు
15. అత్యంత వేగంగా 11 వేల వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడు
16. ఓపెనర్‌గా అత్యంత వేగంగా 9 వేల ODI పరుగులు చేసిన బ్యాటర్
17. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో M.O.M. అవార్డు గెలుచుకున్న ఏకైక కెప్టెన్
18. ODI ఛేజింగ్ లో ఓపెనర్‌గా అత్యధిక సిక్స్‌లు (178)
19. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న అధిక వయసున్న భారతీయుడు (37 ఏళ్లు 313 రోజులు)
20. దక్షిణాఫ్రికాపై సంయుక్తంగా అత్యధిక అంతర్జాతీయ సిక్స్‌లు (64)
21. దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఓపెనర్ (1766)
22. భారత్‌లో 5 వేల వన్డే పరుగులు (మూడో ఆటగాడు) చేసిన రోహిత్
23. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 2 సార్లు M.O.S. గెలుచుకున్న మొదటి భారతీయుడు
24. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 1000 ODI పరుగులు చేసిన మొదటి భారతీయుడు
25. 35 ఏళ్ల వయసు తర్వాత భారత్ తరపున అత్యధిక M.O.M. అవార్డులు (9)
26. ఛేజింగ్ లో సంయుక్తంగా రెండో అత్యధిక ODI సెంచరీలు (17)
27. SENA దేశాలలో 150 సిక్స్‌లు కొట్టిన మొదటి ఆసియా క్రికెటర్
28. 50 అంతర్జాతీయ సెంచరీలు (మూడో భారతీయుడు) చేసిన రోహిత్ శర్మ
29. గెలిచిన మ్యాచ్‌లలో 8 వేల ODI పరుగులు చేసిన మూడో భారతీయుడు)
30. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు (నాలుగో భారతీయుడు అయ్యాడు) పూర్తి
31. భారత్ తరపున ODIల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు
32. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ (10)గా రికార్డ్
33. ఆస్ట్రేలియాపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఓపెనర్ (23)
34. ఆస్ట్రేలియాపై ODIల్లో సంయుక్తంగా అత్యధిక M.O.S. అవార్డులు (3)
35. ఆస్ట్రేలియాపై ODIల్లో M.O.S. అవార్డు గెలుచుకున్న అధిక వయసున్న ప్లేయర్
36. సంయుక్తంగా అత్యధిక ICC ఫైనల్స్ ఆడిన ఆటగాడు (9)
37. ODI ఛేజ్‌లో భారత్ తరపున అత్యధిక సార్లు అత్యధిక పరుగుల ఇన్నింగ్స్ (7)
38. ICC నాకౌట్లలో సంయుక్తంగా అత్యధిక M.O.M అవార్డులు గెలుచుకున్న ప్లేయర్ (3)
39. ICC టోర్నమెంట్‌లలో రెండో అత్యధిక M.O.M అవార్డులు గెలుచుకున్న ఆటగాడు (12)
40. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్లలో అత్యధిక M.O.M గెలుచుకున్న భారతీయుడు (2)
41. ICC ఫైనల్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన అధిక వయసున్న భారతీయుడు
42. కెప్టెన్‌గా అత్యంత వేగంగా 100 మ్యాచ్‌లు గెలుచుకున్న రెండో ఆటగాడు
43. ICCలో న్యూజిలాండ్‌పై 4 మ్యాచ్‌లు గెలుచుకున్న ఏకైక భారతీయ కెప్టెన్
44. గెలిచిన మ్యాచ్‌లలో 12 వేల పరుగులు చేసిన మొదటి ఆసియా ఓపెనర్
45. SENA దేశాలపై 5 వేల ODI పరుగులు చేసిన రెండో ఆసియా ఓపెనర్
46. ICC మ్యాచ్‌లలో భారత కెప్టెన్ ద్వారా వరుసగా అత్యధిక విజయాలు (13)
47. ICC ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలుచుకున్న మొదటి ఆసియావాసి, రెండో కెప్టెన్
48. ICC టోర్నమెంట్‌లో ఒక్క టాస్ కూడా గెలవకుండా ట్రోఫీ గెలుచుకున్న మొదటి కెప్టెన్
49. అన్ని ICC ఈవెంట్‌ల ఫైనల్స్‌లో కెప్టెన్సీ వహించిన ఏకైక కెప్టెన్
50. అన్ని SENA దేశాలపై ICC నాకౌట్లలో గెలిచిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ.





















