Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీని ఔట్ చేసిన గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. విశాల్ వేసిన బాల్ కు కింగ్ కోహ్లీ ముందుకు వచ్చి షాట్ ఆడబోయాడు. కానీ తర్వాత డిఫెన్స్ చేయబోయాడు. దాంతో బాల్ టర్న్ అయి బయటకు వెళ్లింది. వికెట్ కీపర్ స్టంప్ చేసి విరాట్ కోహ్లీని అవుట్ చేసాడు. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ తన వికెట్ తీసిన బౌలర్ విశాల్ జైస్వాల్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.
రన్ మేషిన్ విరాట్ కోహ్లీతో పాటు నితీష్ రాణా, రిషబ్ పంత్ లను కూడా విశాల్ జైస్వాల్ ఔట్ చేశాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీయడంపై విశాల్ మాట్లాడుతూ, కోహ్లీ వికెట్ జీవితాంతం మర్చిపోలేనని చెప్పాడు.
విరాట్ కోహ్లీని ఔట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విశాల్ జైస్వాల్ షేర్ చేసాడు. "ప్రపంచ క్రికెట్‌లో అతన్ని డామినేట్ చేయడం చూడటం నుంచి, అతడితో ఒకే స్టేడియంలో ఆడటం, కోహ్లీ వికెట్ తీయడం వరకు, ఇది నేను ఎప్పుడూ ఊహించని ఒక క్షణం. విరాట్ భాయ్ వికెట్ తీయడం నేను ఎప్పటికీ గుర్తుంచుకునే క్షణం అంటూ రాసుకొచ్చాడు. తన వికెట్ తీసిన బాల్ పై విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసి విశాల్ జైస్వాల్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో ఆ బౌలర్ కు ఈ జీవితంలో మరుపురాని క్షణంలా మారిపోయింది.





















