Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్
టీమ్ ఇండియా యంగ్ బ్యాట్సమన్ శుబ్మన్ గిల్ టీ20 లో వరుసగా విఫలం అవుతున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా శుబ్మన్ గిల్ దూరమయ్యాడు. తన ఫామ్ కారణంగా టీ20 ప్రపంచకప్ లో కూడా చోటు దక్కించుకోలేక పొయ్యాడు.
అయితే గాయం నుంచి కోలుకున్న తర్వాత శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టనున్నాడట. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో గిల్ ఆడనున్నాడు.
సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాదిరిగానే ఈ టోర్నమెంట్ లో మ్యాచ్‌లు ఆడేందుకు గిల్ సిద్ధం అవుతున్నాడు. తన సొంత టీమ్ అయిన పంజాబ్ తరుపున బరిలోకి దిగనున్నాడు.
ఈ టోర్నమెంట్ లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన ప్లేయర్స్ లిస్ట్ లో శుబ్మన్ గిల్ పేరు కూడా ఉంది. కానీ గాయం కారణంగా రెండు మ్యాచులు ఆడలేదు. దాంతో కివీస్‌తో జరిగే సిరీస్‌లోనే ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ తన ఫార్మ్ ను మెరుగుపరుచైకోవడానికి దేశవాళీ క్రికెట్ లో ఆడాలని గిల్ నిర్ణయం తీసుకున్నాడు.





















