World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్ట్ కేవలం 2 రోజుల్లోనే ముగిసింది. నాలుగో టెస్టులో ఆసీస్ గడ్డమీద ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-2027 సైకిల్‌లో ఇది ఆస్ట్రేలియాకు తొలి ఓటమి. ఈ మ్యాచ్ ఫలితం టీమ్ ఇండియాకు కూడా కొంత ప్రయోజనం చేసింది అనే చెప్పాలి.
ఈ ఓటమి తర్వాత కూడా ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోనే ఉంది. అయితే ఈ ఓటమితో ఆస్ట్రేలియా గెలుపు శాతం 100 నుండి 85.71కి తగ్గింది. అయినా కూడా టీమ్ కు 72 పాయింట్లు ఉన్నాయి. ఈ ఓటమి భారత్ సహా ఇతర టీమ్స్ కు కలిసొస్తుంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లలో 2 గెలిచింది. ఆస్ట్రేలియా ఈ ఓటమితో న్యూజిలాండ్‌తో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌లకు, భారత్‌కు ప్రయోజనం కలిగింది. భారత జట్టు 9 టెస్టుల్లో 4 మ్యాచ్‌లు గెలిచి, 4 టెస్టులో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఇండియా 48.15 గెలుపు శాతంతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.





















