Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గా తరలింపు అంశం వివాదాస్పదం అవుతోంది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గాను ఎందుకు తరలిస్తున్నారు, అందుకు కారణాలు ఇవే.

వేములవాడ: ప్రముఖ క్షేత్రం వేములవాడలోని దర్గా గత కొంతకాలం నుంచి హాట్ టాపిక్‌గా ఉంది. ఇక్కడ ఉన్న దర్గా తరలింపు అంశం వివాదాస్పదం అవుతోంది. చివరికి కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ దర్గా గురించి మాట్లాడుకుంటున్నారు. దర్గా తరలింపు వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు వక్స్‌బోర్డు సీఈవో, వేములవాడ ఆలయ కార్యనిర్వహణాధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వేములవాడ ఆలయం మధ్యలో దర్గా..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ దర్గా ఉంది. హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కొందరు హిందువులు ఆలయంతో పాటు దర్గాను దర్శించుకునేవారు. అదే విధంగా కొందరు ముస్లింలు ఆలయంతో కోడె మొక్కులు చెల్లించుకునేవారు. 12వ శతాబ్దం నుంచి వేములవాడ ఆలయంలో దర్గా ఉండటం విశేషం. 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఉన్న దర్గాను ఆలయం నుంచి తరలించాలని తెరపైకి వచ్చింది. అయితే గత రెండు, మూడేళ్ల నుంచి దర్గా తరలింపు అంశం ఊపందుకుంది. భక్తుల తాకిడి పెరగడంతో ఆలయం అభివృద్ధి పనులు చేపట్టిన కారణంగా దర్గా తరలింపునకు అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఫెన్సింగ్ వేసి, బారికేడ్లు అడ్డుపెట్టి దర్గాకు వెళ్లే దారిని మూసివేయడంతో వివాదం మొదలైంది.

అసలు వివాదం ఏంటీ..
వేములవాడ ఆలయం అభివృద్ధి పనుల్లో భాగంగా అందులో ఉన్న శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న దర్గా మరో చోటుకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ మహమ్మద్ నాజిమా అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 800 ఏళ్లుగా మతసామరస్యానికి ప్రతీకంగా ఉన్న దర్గాను అక్కడినుంచి తరలించవద్దని, ఈ మేరకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులను ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. లంచ్ మోషన్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్‌ను ఫిబ్రవరి 26న జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారించారు. దర్గాపై నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉందని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు.

సిరిసిల్ల కలెక్టర్, ఆలయ ఈవో, ఎస్పీ ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మార్చి 2 వరకు దర్గాను కూల్చివేయడం, తరలించడం వంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ఆ దర్గాను ప్రస్తుతం అక్కడి నుంచి తరలించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు ఫెన్సింగ్ వేసి, బారికేడ్లు అడ్డుపెట్టి దర్గాకు వెళ్లే దారిని మూసివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్చి 2

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
మార్చి 2 వరకు దర్గా తరలింపు పిటిషన్‌ను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. వేములవాడకు భక్తుల తాకిడి పెరగడంతో మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా దర్గాను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించినట్టు అధికారులు, ఆలయ ఈవో తెలిపారు. ప్రజాభిప్రాయం ప్రకారమే దర్గాను మరో చోటుకు తరలిస్తున్నాం, తప్పా ఇతర మతాలకు విరుద్ధంగా చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దర్గాపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోబోమని దేవాదాయశాఖ హైకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటిస్తామని జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు కోర్టుకు తెలిపారు. వేములవాడ ఆలయంలోని దర్గా తరలింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వక్స్‌బోర్డు సీఈవోతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవోలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దర్గా తరలింపుపై ఏ నిర్ణయం తీసుకున్నా హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్, ఆలయ ఈవోలను ఆదేశించింది. మార్చి 16కు తదుపరి విచారణను వాయిదా వేశారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆలయంలో ప్రధాని మోదీ పూజలు..
2024లో ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయాన్ని సందర్శించారు. మే 8న వేములవాడ ఆలయంలో పూజలు చేసిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా గోపూజ చేసి, కోడె మొక్కులు సైతం చెల్లించుకున్నారు. అనంతరం కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
























