Repu Udayam 10 Gantalaku First Look: రేపు ఉదయం 10 గంటలకు... సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ - ఎవరెవరు నటిస్తున్నారో చూశారా?
Repu Udayam 10 Gantalaku Movie Cast: అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా 'రేపు ఉదయం పది గంటలకు'. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అభినవ్ గోమఠం (Abhinav Gomatam) అంటే ఆడియన్స్ చాలా మందికి కామెడీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు ఆయన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు గ్లామరస్ హీరోయిన్ హెబ్బా పటేల్, '30 వెడ్స్ 21' నుంచి 'మయసభ' వెబ్ సిరీస్, ఇంకా పలు సినిమాల్లో హీరోగా నటించిన చైతన్య రావు, ఇంకా కిరీటి దామరాజు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల చేశారు.
పది గంటలు & రెండు గంటలు...
ఫస్ట్ లుక్ వెనుక కథ ఏమిటో తెలియాలి!
'రేపు ఉదయం పది గంటలకు' చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలవుతోన్న చిత్రమిది. సినిమాను రామ్ వీరపనేని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. త్వరలో విడుదల తేదీని వెల్లడించనున్నారు.
'రేపు ఉదయం పది గంటలకు' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... రెండు గడియారాలను హైలైట్ చేశారు. టైటిల్ డిజైన్ వెనుక ఒక గడియారం, నటీనటులు అందరి వెనుక మరొక గడియారం ఉన్నాయి. టైటిల్ డిజైన్ గడియారంలో పది గంటలు చూపిస్తే... ఆర్టిస్టుల వెనుక గడియారంలో రెండు గంటలు చూపించారు. ఆ రెండిటి మధ్య సంబంధం ఏమిటో తెలియాలంటే... టీజర్, ట్రైలర్ విడుదల వరకు వేచి చూడాలి.
View this post on Instagram
అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ తదితరులు నటించిన 'రేపు ఉదయం పది గంటలకు' చిత్రానికి నిర్మాత: రామ్ వీరపనేని, దర్శకుడు: చెండు ముద్దు, సమర్పకులు: మాంగో మాస్ మీడియా, ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామా, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, కూర్పు: డి. వెంకట ప్రభు.
Also Read: Virosh Sangeet: విజయ్ దేవరకొండ - రష్మిక డ్యాన్స్ అదుర్స్... సంగీత్ ఫోటోలు చూశారా? స్టెప్పులు సూపర్























