The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
Ram Gopal Varma : 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ ఉద్దేశించి RGV తాజాగా ట్వీట్ చేశారు. విలన్ల చెంప పగలగొట్టేలా చేశారని రాసుకొచ్చారు.

RGV Reaction On Heroines Dressing In The Raja Saab Pre Release Event : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి, నాగబాబు, ప్రకాష్ రాజ్, ఆర్జీవీ సైతం శివాజీ కామెంట్స్‌ను తప్పుపడుతూ కౌంటర్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతున్న వేళ సెన్సేషనల్ డైరెక్టర్ RGV మరోసారి దీనిపై రియాక్ట్ అయ్యారు.
విలన్ అని కంపేర్ చేస్తూ...
తాజా ట్వీట్‌లో శివాజీని విలన్ అని సంబోదించారు RGV. శనివారం 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. 'హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్... ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ అండ్ కో చేసిన అరుపులను పట్టించుకోకుండా వారికి నచ్చిన దుస్తులను సరిగ్గా ధరించారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ఆ విలన్ల చెంప పగలగొట్టారు. వీరికి హ్యాట్సాఫ్.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. శివాజీకి కౌంటర్ ఇస్తూ అంతకు ముందు కూడా RGV ట్వీట్స్ చేశారు.
All 3 heroines of #Prabhas @AgerwaLNidhhi@MalavikaM_
— Ram Gopal Varma (@RGVzoomin) December 28, 2025
@riddhiculousart din’t care about moral barkings of Shivaji and his vitriolic batch at #RajaSaab event and wore exactly what they want to wear.😎😂🤣 Hats off to you 3 HEROES for giving tight face slap to those VILLAINS pic.twitter.com/7tJPUaIROC
Also Read : అల్లు అర్జున్, అట్లీ పాన్ వరల్డ్ మూవీ - 600 కోట్ల బిజినెస్ డీల్!... ఇండియన్ సినిమాల్లో రికార్డు
వివాదం ముగిసేనా?
మరోవైపు, హీరో శివాజీ తన కామెంట్స్‌పై ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణలు చెప్పారు. అటు మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చారు. తనపై ఎవరో కుట్ర చేశారని... జూమ్ మీటింగ్ పెట్టి మరీ తనకు బాగా తెలిసిన వారే ఇలా చేశారని ఆరోపించారు. మంచి చెప్పకూడదని తనకు అర్థమైందని తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని రిక్వెస్ట్ చేశారు.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఇంకా ఇదే అంశంపై ట్రోలింగ్ సాగుతూనే ఉంది. శివాజీకి చాలా మంది నెటిజన్లు సపోర్ట్ చేస్తుండగా కొందరు ఆయన రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందంటూ కామెంట్స్ చేస్తున్నరు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నాగబాబు, ఆర్జీవీ ఆయన కామెంట్స్‌ను తప్పుపట్టారు. అటు, అనసూయపైనా ట్రోలింగ్ సాగుతోంది. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలంటూ నెట్టింట చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.






















