Nidhhi Agerwal : మీ డ్రీమ్ మల్టీ స్టారర్ ఏంటి? - నిధి అగర్వాల్ క్రేజీ ఆన్సర్... ఈ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై సాధ్యమేనా?
Nidhhi Agerwal Reaction : 'ది రాజా సాబ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ 'X' వేదికగా క్రేజీ ఆన్సర్స్ చెప్పారు. తన డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి? అనే దానిపై రియాక్ట్ అయ్యారు.

Nidhhi Agerwal Reaction On Fan Question About Multistarrer : 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పేరు మార్మోగుతోంది. ఈవెంట్‌లో ప్రభాస్ తనదైన స్పీచ్‌తో అదరగొట్టగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా, మూవీ ప్రమోషన్లలో భాగంగా నిధి '#Ask Nidhhi' పేరుతో 'X'లో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు క్రేజీ ఆన్సర్స్ చెప్పారు.
డ్రీమ్ మల్టీ స్టారర్
'నిధి తెలుగులో మీ డ్రీమ్ మల్టీ స్టారర్ ఏంటి?' అని ఓ అభిమాని ప్రశ్నించగా... ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోలుగా... తాను హీరోయిన్‌గా ఉంటే సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రియల్‌గా ఇది సాధ్యం కాని కాంబో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉండగా... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పాలనలో బిజీగా ఉన్నారు. నిధి అగర్వాల్ డ్రీమ్ ఓ కలగానే మిగిలిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ది రాజా సాబ్' కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఎగ్జైట్మెంట్‌తో కూడిన ఓ ఇమేజ్‌ను షేర్ చేశారు. అలాగే, ప్రబాస్ నటించిన సినిమాల్లో మీకు ఏదంటే బాగా ఇష్టం? అనే ప్రశ్నకు 'సలార్' అంటూ నిధి రిప్లై ఇచ్చారు. మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటే తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
PK sir
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025
PRABHAS sir
NIDHHI me
SRV #AskNidhhi #TheRajaSaab https://t.co/CG1GzbHyEV
Also Read : ఫ్యాన్స్ అత్యుత్సాహంతో కింద పడిన విజయ్ - స్టార్ హీరోను ఇబ్బంది పెట్టేశారుగా...
ట్రైలర్ ఏది రాజా సాబ్?
ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ కామెడీ జానర్‌లో నటిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వింటేజ్ లుక్స్ అదిరిపోయాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినా ఇప్పటివరకూ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ట్రైలర్ ఎక్కడ రాజా సాబ్? అంటూ పోస్టులు పెడుతున్నారు.
మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా... బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 9న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















