Vijay : ఫ్యాన్స్ అత్యుత్సాహంతో కింద పడిన విజయ్ - స్టార్ హీరోను ఇబ్బంది పెట్టేశారుగా...
Vijay Reaction : తమిళ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. చెన్నై ఎయిర్ పోర్టులో ఆయన్ను చూసేందుకు ఒక్కసారిగా ముందుకు రాగా కింద పడ్డారు.

Vijay Falls Down In Chennai Airport : ఇటీవల ఫ్యాన్స్ అభిమానం హద్దు మీరుతుంది. మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్, సమంతను ఇబ్బంది పెట్టగా... మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న బాలీవుడ్ హీరో హర్షవర్థన్ రాణే చొక్కాను సైతం చించేశారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సైతం అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొన్నారు.
కింద పడ్డ స్టార్
రీసెంట్‌గా మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 'జన నాయగన్' ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ అక్కడి నుంచి చెన్నై చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుండగా కొందరు ఫ్యాన్స్ ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు.
పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వారిని కంట్రోల్ చేసినా ఫలితం లేకపోయింది. విజయ్ కారు వద్దకు వెళ్తున్న టైంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో కిందపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆయన్ను సేఫ్‌గా కారు ఎక్కించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత అత్యుత్సాహం పనికిరాదని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
மலேசியாவில் இருந்து சென்னை திரும்பிய விஜய்க்கு உற்சாக வரவேற்பு அளித்த ரசிகர்கள்..! #Vijay #JanaNayaganAudioLaunch #PoojaHegde #Rollsroyce #NAnand #ThalapathyThiruvizha #ThalapathyKacheri #JanaNayagan #AudioLaunch #Malaysia #TamilNews #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/F1TIpaGjXR
— KAVI (@tamiltechstar) December 29, 2025
Also Read : తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ రిజల్ట్ - ప్రొగ్రెసివ్ ప్యానల్ విజయం
సినిమాలకు రిటైర్మెంట్
శనివారం 'జన నాయగన్' ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై డ్యాన్స్ వేసిన విజయ్ అభిమానులను ఉత్సాహపరిచారు. అక్కడ TVK నినాదాలు చేస్తోన్న ఫ్యాన్స్‌ను వద్దని వారించారు. ఇక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 'జన నాయగన్' తన లాస్ట్ మూవీ అని కన్ఫర్మ్ చేశారు. ఇది విన్న ఫ్యాన్స్ ఎమోషనల్‌కు గురయ్యారు.
ఇంత కాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతానని.. అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పారు విజయ్. 'ఫస్ట్ నుంచీ నేనెన్నో విమర్శలు ఎదుర్కొన్నా. 33 ఏళ్లుగా ఫ్యాన్స్ నన్నుసపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఓ చిన్న ఇల్లు అయినా నిర్మించుకోవాలని ఇండస్ట్రీకి వచ్చా. ఫ్యాన్స్ నాకు రాజభవనం ఇచ్చారు. నన్ను ఇంతగా ఆదరించిన వారికి నేను సపోర్ట్‌గా ఉండాలనుకుంటున్నా.' అంటూ చెప్పారు.
ఫ్యాన్స్ ఎందుకిలా?
గత కొద్ది రోజులుగా బహిరంగ ఈవెంట్లలో ఫ్యాన్స్ అత్యుత్సాహం స్టార్లను ఇబ్బంది పెడుతూనే ఉంది. మొన్నటి నిధి అగర్వాల్ ఘటన నుంచీ చూసుకుంటే నిన్నటి విజయ్ ఘటన వరకూ ఇది స్పష్టమవుతోంది. బాలీవుడ్ యాక్టర్ హర్షవర్ధన్ రానే చొక్కాను కూడా చించేశారు. ఇది మంచి పద్ధతి కాదని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండగా... బహిరంగ ఈవెంట్లకు వచ్చేటప్పుడు వారికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా తగినంత సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.






















