సమాజానికి, ఫిల్మ్ ఇండస్ట్రీకి తను చేస్తున్న సేవలను గుర్తించి 2007లో విజయ్‌కు డాక్టరేట్ దక్కింది.

తమిళ హీరో అయినా కూడా కేరళలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నవారిలో విజయ్ ఒకరు.

పదేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అడుగుపెట్టారు విజయ్. వెట్రీ, కుడుంబం, వసంత రంగం వంటి చిత్రాల్లో నటించారు.

టామ్ క్రూజ్ బీచ్ హౌజ్‌ను చూసి ఇష్టపడిన విజయ్.. తను కూడా అలాంటిదే కట్టించుకున్నారు.

తన మూవీ ‘తుపాకీ’తో రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన అయ్యారు విజయ్. రజినీ తర్వాత ఈ రికార్డ్ తనకే దక్కింది.

ముందుగా ఫ్యాన్స్.. తనను ప్రేమగా ఇళయదళపతి అని పిలుచుకోగా.. దానిని దళపతిగా మార్చాడు దర్శకుడు అట్లీ.

తన పేరు, తన భార్య సంగీత పేరు కలిసేలా తన కుమారుడికి జేసన్ అని పేరు పెట్టుకున్నాడు ఈ హీరో.

‘రౌడీ రాథోడ్’ అనే హిందీ మూవీలో ‘చింతాతా’ పాటలో విజయ్ చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించారు.

‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ అనే ఆర్గనైజేషన్ ద్వారా చారిటీ వర్క్స్ చేస్తుంటారు విజయ్.

తను హీరో అవ్వడానికి రజీనీకాంత్‌నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు విజయ్. (Images Credit: Social Media)