ఈరోజుల్లో బ్లౌజ్ డిజైన్స్ కూడా మోడర్న్, బోల్డ్‌గా ఉంటేనే యూత్ ఇష్టపడుతున్నారు.

అలా మోడర్న్ లుక్ కావాలనుకునే అమ్మాయిలు.. వేదిక వార్డ్‌రోబ్ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి.

ఈమధ్య బ్లౌజ్‌పై పూసలు రావడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది.

సింపుల్ చీర అయినా, లెహెంగా అయినా.. దానిపై షిమ్మరింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచ్.

హెవీ లెహెంగాలపై పువ్వుల వర్క్‌తో హెవీ షిమ్మరింగ్ బ్లౌజ్.. మీ లుక్‌ను మరింత బోల్డ్‌గా మారుస్తుంది.

లైట్ కలర్ బ్లౌజ్‌పై వైట్ కలర్ హెవీ పూసలు, డీప్ నెక్.. సింపుల్‌గా ఉన్నా క్లాస్సీ లుక్ ఇస్తుంది.

ఫిష్ టెయిల్ లెహెంగాలపై నెట్ బ్లౌజ్‌లు పర్ఫెక్ట్. అలాంటి వాటికి ఇలా ఫ్రిల్స్ హ్యాండ్స్ పెడితే అదొక డిఫరెంట్ లుక్.

డీప్ నెక్, స్లీవ్‌లెస్, చమ్కీల వర్క్.. ఇవన్నీ కలిపిన బ్లౌజ్ కాంబినేషన్ ఎవర్‌గ్రీన్.

ఎప్పుడూ చమ్కీల డిజైన్ మాత్రమే కాదు.. అద్దాల వర్క్‌తో బ్లౌజులు కూడా బాగుంటాయని వేదిక డ్రెస్ చూస్తే తెలుస్తుంది.

All Images And Video Credit: Vedhika/Instagram