గతకొంతకాలంగా బాలీవుడ్‌లో ఎన్నో హారర్ సినిమాలు తెరకెక్కి సక్సెస్ సాధించాయి. అందులో కొన్ని సినిమాలు.. ‘ముంజ్యా’ to ‘స్త్రీ’ - జానపద కథల ఆధారంగా తెరకెక్కాయి. జానపద కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాల లిస్ట్‌లో ఏయే సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేయండి. తాజాగా విడుదలయిన ‘ముంజ్య’లో కూడా మహారాష్ట్ర, కోంకనీ కల్చర్‌ను ఎక్కువగా చూపించారు. శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ’లో కర్ణాటక కల్చర్ అయిన ‘నలే బా’ను ఫోకస్ చేశారు. వరుణ్ ధావన్ లీడ్ రోల్ చేసిన ‘భేడియా’.. హిమాచల్ ప్రదేశ్ కల్చర్ ఆధారంగా వచ్చింది. స్త్రీ యూనివర్స్‌లో తెరకెక్కిన మరో చిత్రం ‘రూహీ’ కూడా నార్త్ ఇండియన్ కల్చర్ అయిన ముడియపైరీని హైలెట్ చేసింది. తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటించిన ‘బుల్‌బుల్’ బెంగాలీ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లోని హారర్ చిత్రంగా తెరకెక్కింది. మహారాష్ట్రలోని తుంబాడ్ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ‘తుంబాడ్’ చిత్రం వచ్చింది. ఇది గ్రీక్ మైథాలజీ చుట్టూ తిరుగుతుంది. బెంగాలీలోని ఇఫ్రిత్ అనే దెయ్యం కథ ఆధారంగా అనుష్క శర్మ ‘పరి’ సినిమా చేసింది. (All Images Credit: Social Media)