హీరోయిన్ అమలా పాల్ తల్లి అయ్యింది. ఆవిడకు అబ్బాయ్ పుట్టాడు. అతడి పేరు, పుట్టిన తేదీ వివరాలు తెలుసా?

జూన్ 11న, 2024న అమలా పాల్ పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చింది.

ప్రస్తుతం తల్లి అమలతో పాటు పిల్లాడు కూడా క్షేమంగా ఉన్నాడు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. 

పిల్లాడికి ఇలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అమలా పౌల్ ఫ్యామిలీ. వీడియోలో అమల భర్త జగత్ దేశాయ్‌ను చూడొచ్చు.

అమలా పాల్, జగత్ దేశాయ్ దంపతులు తమ పిల్లాడికి 'ఇలయ్' అని పేరు పెట్టినట్లు తెలిపారు.

గతేడాది నవంబర్ 5, 6 తేదీల్లో అమలా పాల్, జగత్ దేశాయ్ పెళ్లి చేసుకున్నారు.

పెళ్ళైన రెండు నెలలకే తాను గర్భవతి అని అమలా పాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరిలో గుడ్ న్యూస్ షేర్ చేశారు

జనవరి 3న తాను ప్రెగ్నెంట్ అని అమలా పాల్ తెలిపారు. ఇప్పుడు బిడ్డ పుట్టిన విషయం చెప్పారు.

అమలా పాల్, జగత్ దేశాయ్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

అమలా పాల్ (all images and video courtesy: amalapaul/ instagram)