రాఖీ సావంత్.. తనకు సారీ చెప్పేందుకు ప్రయత్నించిన మాజీ ప్రియుడు అభిషేక్‌ను చెంపపై కొట్టింది. లైవ్ కాన్సర్ట్ లో ఒక డాక్టర్ ని చెంపపై కొట్టాడు మిల్కాసింగ్. దానిపై కేసు కూడా నమోదైంది. పొట్టి డ్రెస్ వేసుకున్నందుకు గౌహర్ ఖాన్ ని చెంపదెబ్బ కొట్టారు. మౌనిక అనే ఒక అమ్మాయి ఢిల్లీలోని ఒక పార్టీలో సల్మాన్ ఖాన్ ని కొట్టింది. యాక్టర్ గోవింద 2008లో తన ఫ్యాన్ పై చేయి చేసుకున్నారు. అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రా సెక్రటరీ ప్రకాశ్ జాజుని చెంపదెబ్బ కొట్టారు. రిషీకపూర్ 2006లో పబ్లిక్ లో ఒక ఫొటోగ్రాఫర్ ని కొట్టారు. లాకోన్ హైన్ యాహన్ దిల్వాలే సెట్ లో ఆదిత్య పంచోలి తన కో స్టార్ విజి భాటియాని చెంప దెబ్బ కొట్టాడు. సెల్ఫీ అడిగిన ఫ్యాన్ ని జాన్ అబ్రహం చెంప మీద కొట్టాడు. 2005లో ఈషా డియోల్ అమృత రావును కొట్టింది. కంగనా రనౌత్ ని సీఐఎస్ ఎఫ్ కానిస్టేబుల్ ఎయిర్ పోర్ట్ లో చెంపదెబ్బ కొట్టింది.