కాజల్ అగర్వాల్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరి, టాప్ 10 డిజాస్టర్ మూవీస్ ఏవో తెలుసా? కాజల్‌కు నచ్చిన 'బ్రహ్మోత్సవం' ఆమె కెరీర్‌లోనే కాదు... మహేష్ బాబుకూ భారీ డిజాస్టర్. నాగ చైతన్య 'దడ' ఫ్లాప్ సంగతి పక్కన పెడితే... కాజల్ లుక్, చిన్మయి డబ్బింగ్ సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు తెరకు కాజల్‌ను పరిచయం చేసిన తేజ... 'సీత'తో ఆమెకు ఫ్లాప్ ఇచ్చారు. విష్ణు మంచుకు అక్కగా నటించిన 'మోసగాళ్లు'కు అయితే మినిమమ్ షేర్, పోస్టర్ ఖర్చులు రాలేదని టాక్. నితిన్ ఫ్లాఫుల పరంపరలో ఉన్నప్పుడు అతడికి జోడీగా నటించిన 'ఆటాడిస్తా' కాజల్‌కు భారీ డిజాస్టర్ ఇచ్చింది. రవితేజతో కాజల్ నటించిన 'వీర' కూడా అరివీర భయంకర డిజాస్టర్లలో ఒకటి. తెలుగులో తన తొలి సినిమా హీరో కళ్యాణ్ రామ్ సరసన మరోసారి నటించిన 'ఎమ్మెల్యే' కూడా ఫ్లాపే 'సీత'కు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో నటించిన 'కవచం' కూడా డిజాస్టరే. దుల్కర్ సల్మాన్ 'హే సినామిక', శర్వానంద్ 'రణరంగం' సైతం కాజల్ కెరీర్‌లో ఫ్లాప్స్ (All Images Courtesy: kajalaggarwalofficial / Instagram)