బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోయినా కంగనా రనౌత్.. ఒక్క మూవీకి రూ.15 కోట్ల నుంచి రూ.27 కోట్లు తీసుకుంటోంది. హాలీవుడ్‌లోనే బిజీ అయిన ప్రియాంక చోప్రా.. ఒక్క సినిమాకు రూ.15 కోట్లు నుంచి రూ.25 కోట్లు తీసుకుంటూ 3వ స్థానంలో నిలిచింది. సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఒక్కో మూవీకి రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తుంది. సీనియర్ హీరోయిన్లకు పోటీగా ఆలియా భట్.. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది. కరీనా కపూర్.. సినిమాకు రూ.8 కోట్ల నుంచి రూ.18 కోట్లు డిమాండ్ చేస్తూ అస్సలు తగ్గనంటోంది. శ్రద్ధా కపూర్.. ఒక్క సినిమా కోసం రూ.7 కోట్ల నుంచి రూ.15 కోట్లు తీసుకుంటోంది. విద్యా బాలన్ రూ.8 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకుంటోంది. ఒక్క సినిమాకు రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్లు అందుకుంటూ 9వ స్థానంలో నిలిచింది అనుష్క శర్మ. ఐశ్వర్య రాయ్ రూ.10 కోట్ల రెమ్యునరేషన్‌తో లిస్ట్‌లో చివరి స్థానంలో ఉంది. దీపికా పదుకొనె.. ఒక్క సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్‌లో ఉంది.