India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
India Squad For IND vs NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ఎంపికైంది. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది.

India Squad For IND vs NZ ODI Series | న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టీమ్ ఇండియా ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల సిరీస్ జరుగుతుంటే ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్ గత కొన్ని సిరీస్ లకు అందుబాటులో లేడు. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ ను కివీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించిన గిల్ ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత వన్డే స్క్వాడ్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్, 21 నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నాయి. 2027 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న ప్రధాన ఆటగాళ్లకే సెలక్షన్ కమిటీ ఛాన్స్ ఇచ్చింది. దీనిలో శ్రేయస్ అయ్యర్‌కు టీమ్‌లో చోటు… pic.twitter.com/o9RUlzkvot
— ABP Desam (@ABPDesam) January 3, 2026
నిజానికి, జట్టు యాజమాన్యం ప్రస్తుతం రాబోయే T20 ప్రపంచ కప్ పై దృష్టి పెట్టింది. అందుకే సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, జస్పిత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారని గతంలో అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగే T20 సిరీస్‌లో ఇద్దరు స్టార్లు భాగం కాదు. గాయాల బారిన పడే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా బీసీసీఐ వీరికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది. టీ20 వరల్డ్ కప్ నకు ఎంపికకాని వన్డే కెప్టెన్ గిల్ ఈ సిరీస్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ పాల్గొనడంపై అనుమానాలు..
పక్కటెముకల గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ సమస్యతో జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. కానీ ఈ సిరీస్‌లో అతడు ఆడటం అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని భారత బోర్డు స్పష్టం చేసింది. BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి అతనికి ఇంకా ఫిట్‌నెస్ అనుమతి రాలేదు.
మహమ్మద్ షమీకి మళ్లీ నిరాశే..
డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడగా రాణించిన అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని బీసీసీఐ పెద్దలు మరోసారి విస్మరించారు. షమీ ప్రస్తుతం 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ODI సిరీస్‌లో షమీకి అవకాశం లభించడం దాదాపు ఖాయమని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నా, ఆశించింది జరగలేదు. హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు కానీ, టాలెంటెడ్ బౌలర్ షమీని మాత్రం మరోసారి పక్కన పెట్టేశారు.
వన్డే సిరీస్ షెడ్యూల్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ జనవరి 11న ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ వడోదరలో జరుగుతుంది. రెండవ మ్యాచ్ జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా జరుగుతుంది. మూడవ. చివరి మ్యాచ్ జనవరి 18న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుందని తెలిసిందే.





















