Rohit Sharma Kohli Records: 2026లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బద్దలుకొట్టనున్న 5 పెద్ద రికార్డులు
Kohli Records 2026 | నూతన సంవత్సరంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాది కివీస్‌తో తొలి వన్డే నుంచి రోకో రికార్డుల వేట ప్రారంభించనున్నారు.

Rohit Sharma Records: కొత్త సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు మొదటి సిరీస్ న్యూజిలాండ్‌తో ప్రారంభిస్తుంది. మొదటి మ్యాచ్ జనవరి 11న న్యూజిలాండ్‌తో జరగనుంది. ఇందులో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టవచ్చు. ఈ సంవత్సరం కోహ్లీ అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా 2026లో అనేక రికార్డులు సృష్టించవచ్చు. వీరిద్దరూ ఇప్పుడు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఇదివరకే టీ20 ఇంటర్నేషనల్, టెస్ట్ ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యారని తెలిసిందే.
న్యూజిలాండ్ జట్టుపై అత్యధిక పరుగులు
విరాట్ కోహ్లీ 2026లో మొదటి మ్యాచ్‌లోనే 2 పెద్ద రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్, రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి మరో 94 పరుగులు చేయాలి. కోహ్లీ గత సిరీస్‌లో 2 సెంచరీలు, 1 అర్ధశతకం సాధించాడు. కోహ్లీ ఫామ్‌ను చూస్తే అతను ఒకట్రెండు మ్యాచ్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టవచ్చు. కివీస్ తో తొలి మ్యాచ్‌లో సెంచరీకి చేరువైనా, కోహ్లీ ఈ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అతను సెహ్వాగ్ (6)తో కలిసి సంయుక్తంగా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.
వన్డేలో అత్యధిక పరుగులు
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నాడు. అతను ఈ జాబితాలో జాక్ కలిస్ (11579 పరుగులు), ఇంజమామ్-ఉల్-హక్ (11739)లను అధిగమించడానికి దగ్గరగా ఉన్నాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్ ఖాతాలో ప్రస్తుతం 11516 పరుగులు ఉన్నాయి. ఈ ఇద్దరు దిగ్గజాలను అధిగమించడానికి రోహిత్‌కు 224 పరుగులు కావాలి. కొన్ని మ్యాచుల్లోనే ఈ సంవత్సరం హిట్ మ్యాన్ తప్పక చేస్తాడు.
అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు
క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సచిన్ టెండూల్కర్ (100) పేరు మీద ఉన్నాయి. ఈ రికార్డు బద్దలు కొట్టడం ప్రస్తుతం అసాధ్యం. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ, 10వ స్థానంలో రోహిత్ ఉన్నారు. రోహిత్ ఈ సంవత్సరం బ్రియాన్ లారా (53), జయవర్ధనే (54), హషీమ్ ఆమ్లా (55) వంటి దిగ్గజాలను అధిగమించే అవకాశం ఉంది. రోహిత్ ఖాతాలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు ఉన్నాయి. ఈ సంవత్సరం మరో 5 సెంచరీలు చేస్తే, లారా, జయవర్ధనేలను అధిగమించి, ఆమ్లాతో సమానంగా నిలుస్తాడు.
వన్డేలో అత్యధిక అర్ధశతకాలు
వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్ధశతకాల జాబితాలో రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నాడు. అతను ఈ సంవత్సరం రాహుల్ ద్రవిడ్ (95), జయసూర్య (96), జయవర్ధనే (96)లను అధిగమించవచ్చు. రోహిత్ ఈ సంవత్సరం 6 హాఫ్ సెంచరీలు సాధిస్తే, వన్డే క్రికెట్‌లో 100 అర్ధశతకాలు సాధించిన ప్రపంచంలో 6వ బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ రోహిత్ శర్మ. అంతర్జాతీయంగా భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోని, మాజీ కెప్టెన్ ఖాతాలో 359 సిక్సర్లు ఉన్నాయి. 318 సిక్సర్లతో మూడో స్థానంలో విరాట్ కోహ్లీఉన్నాడు. ఈ సంవత్సరం కోహ్లీ 42 సిక్సర్లు కొడితే ధోనీని అధిగమించవచ్చు.





















