అన్వేషించండి

8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

Salary Hike for central govt employees | కొత్త సంవత్సరం 2026 ప్రారంభమైంది. 1.19 కోట్ల కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆశగా ఎదరుచూస్తున్నారు.

8th pay commission: కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెట్టాక తమ జీతం ఎప్పుడు పెరుగుతుందా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. దేశంలోని సుమారు 1.19 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి కేంద్ర ఉద్యోగి 8వ వేతన సంఘం నిర్ణయాల అమలుతో తమ జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

చాలా నెలలుగా ఎదురుచూస్తున్నప్పటికీ, 8వ వేతన సంఘంపై 2026లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. గత ట్రెండ్‌ను పరిశీలిస్తే, కమిషన్ ఏర్పాటు తర్వాత కొత్త వేతన సంఘం అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. కొత్త వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది అమలులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. 

కమిషన్ సిఫార్సులు ఎప్పటిలోగా అమలు కావచ్చు?

గత ఏడాది జరిగిన ప్రక్రియను పరిశీలిస్తే, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనవరి 15, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ప్రక్రియ చాలా కాలం ముందుకు సాగలేదు. సుమారు 10 నెలల తర్వాత అక్టోబర్ 28న అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 8వ వేతన సంఘానికి తన నివేదికను సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చారు. 

అక్టోబర్ 2025 నుండి 18 నెలల సమయాన్ని చూసుకుంటే, నిర్ణీత గడువు జూలై 2027కి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన జీతం ప్రయోజనాలు 2027లో అమలు కావొచ్చు. లేదా కేంద్రం నిర్ణయంలో జాప్యం జరిగితే 2028 ప్రారంభంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనాలు లభిస్తాయి. 

ఈ ఆలస్యానికి కారణం ఏమిటి?

8వ వేతన సంఘానికి తన నివేదికను సిద్ధం చేయడానికి 18 నెలల సమయం ఇచ్చారు. మరోవైపు కమిషన్ ఏర్పాటులో జాప్యం సైతం ఓ కారణం. ఆ నివేదిక వచ్చిన తర్వాత సిఫార్సులపై పరిశీలన, కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి దాదాపు 6 నెలల టైం పడుతుంది. ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాలు కావొచ్చు. ఈ కారణంగానే కొత్త జీతం, పింఛన్ ప్రయోజనాలు 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో అమలు కానున్నాయి. గత రెండేళ్లనుంచి దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Snow Removal Jobs : మంచు తొలగిస్తే లక్షల్లో జీతం.. ఉద్యోగం, సౌకర్యాల గురించిన పూర్తి వివరాలివే

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget