BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ లో వరుసగా విఫలమవుతుంది. ప్లేయర్స్ ను మార్చడం, వాళ్ల పొజిషన్ ను చేంజ్ చేయడం వల్లే టీమ్ ఇండియా ఓటమి పాలవుతుందని ఎన్నో కామెంట్స్ వచ్చాయి. టెస్ట్ క్రికెట్ కు కొత్త కోచ్ ను నియమించండి అంటూ ఫ్యాన్స్ తోపాటు క్రికెట్ విశ్లేషకులు కూడా కామెంట్స్ చేసారు. దాంతో బీసీసీఐ టెస్ట్ కోచ్ ను మారుస్తుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
అలాగే దిగ్గజ ప్లేయర్ VVS లక్ష్మణ్ ను కొత్త టెస్ట్ కోచ్ గా నియమించబోతున్నారని కూడా అన్నారు. ఈ విషయాలపై బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఊహాగానాలనే అని.. అసలు అలాంటి చర్చే జరుగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ ‘కోచ్ మార్పుపై వస్తున్న వార్తలు అవాస్తవం. అవన్నీ పూర్తిగా ఊహాజనితమైనవి. అసలు బోర్డులో కోచ్ మార్పు గురించి చర్చ జరగలేదు అని అన్నారు. గంభీర్ కాంట్రాక్టు 2027 ప్రపంచకప్ వరకూ ఉంది. అతడిపై మాకు పూర్తి నమ్మకముంది అని తెలిపాడు.



















