Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Peddi Jagapathi Babu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' నుంచి బిగ్ సర్పైజ్ వచ్చేసింది. ఈ మూవీలో మరో క్యారెక్టర్‌ను మేకర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సీనియర్ హీరో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

Jagapathi Babu First Look From Ram Charan Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు కాంబోలో అవెయిటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. తాజాగా ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది.
ఆ రోల్‌లో సీనియర్ స్టార్ హీరో
ఈ మూవీలో సీనియర్ హీరో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ పేరు 'అప్పలసూరి'. ఆయన లుక్‌ను పూర్తిగా గుర్తు పట్టలేనంతగా మూవీ కోసం మార్చేశారు. ''పెద్ది' నుంచి అప్పలసూరిగా అద్భుతమైన నటుడు జగపతిబాబు. ధైర్యమైన, పవర్ ఫుల్ పాత్రలో ఆయన మాస్టర్ క్లాస్ యాక్టింగ్ కోసం మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది.
ఈ లుక్ చూసిన నెటిజన్లు జగపతిబాబు లుక్ అదిరిపోయిందని... ఇంతకు ముందెన్నడూ ఆయన్ను ఇలాంటి లుక్‌లో చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన రోల్ ఏంటి? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. లుక్‌ను బట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
The incredible @IamJagguBhai as 'APPALASOORI' from #Peddi ❤🔥
— PEDDI (@PeddiMovieOffl) December 29, 2025
Brace yourselves for his masterclass performance in a strong, impactful role 💥
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/1grBI4yQVX
Also Read : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్ ట్రెండ్ అవుతున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచీ సిగ్నేచర్ షాట్, చికిరి చికిరి సాంగ్ వరకూ ప్రతిదీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ఢిల్లీలో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరగనుంది. జనవరికే షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా బుచ్చబాబు ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. త్వరలోనే న్యూ సాంగ్, ఇతర అప్డేట్స్ రానున్నాయి.
ఈ మూవీలో 'పెద్ది'గా రామ్ చరణ్ లుక్, జాన్వీ కపూర్ లుక్‌తో పాటు కరుణాడ చక్రవర్తి శివరాజ్ లుక్ అదిరిపోయాయి. తాజాగా జగపతిబాబు లుక్ సైతం వేరే లెవల్‌లో ఉంది. తొలుత ఆయన పోస్టర్‌ను చూసిన ఎవరైనా గుర్తు పట్టలేనంతగా డిజైన్ చేశారు. దీంతో స్టోరీపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.
సమ్మర్‌కు రిలీజ్
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఉత్రరాంధ్ర గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో మూవీ రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






















