నటుడిగా రామ్ చరణ్ మీద రెస్పెక్ట్ పెంచిన రోల్స్

Published by: Satya Pulagam

మగధీరుడు... నటుడిగానూ హిట్టు!

కాల భైరవ... వందమందిని మట్టికరిపించే యోధుడిగా, మగధీరుడిగా రెండో సినిమా 'మగధీర'లో రామ్ చరణ్ చక్కటి నటన కనబరిచారు. ఈతరం యువకుడు హర్ష పాత్రలోనూ ఆయన మెప్పించారు. సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం కాదు, రెండో సినిమాకే నటుడిగానూ చరణ్ హిట్ కొట్టారు.

చిట్టి బాబు... సలామ్ ఆ నటనకు!

చిట్టి బాబు... 'రంగస్థలం'లో వినికిడి లోపం ఉన్న యువకుడిగా, అన్న చావుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఒప్పిగ్గా ఎదురుచూసే తమ్ముడిగా చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులో నటనకు యాంటీ ఫ్యాన్స్ సైతం సలామ్ కొట్టారు.

అల్లూరి... యావత్ దేశం మోకరిల్లి!

రామ్ చరణ్ అంటే ఉత్తరాది ప్రేక్షకులు సైతం పడి చచ్చేలా చేసిన రోల్ అల్లూరి సీతారామరాజు. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన థియేటర్లు 'జై శ్రీరామ్' నినాదాలు చేశారంటే కారణం రామ్ చరణ్ నటనే. ఆయన అభినయానికి యావత్ దేశం మోకరిల్లింది.

అప్పన్న... అసలు ఏం చేశావన్నా!

'గేమ్ చేంజర్' విడుదలైన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడిన రోల్ అప్పన్న. నత్తి వల్ల నలుగురిలో అనుకున్నది మాట్లాడలేక మానసిక క్షోభ అనుభవించే పాత్రలో రామ్ చరణ్ జీవించేశారు. భార్యను కాపాడుకోవడం కోసం కత్తిపోటుకు గురయ్యే సన్నివేశంలో నటన అద్భుతం. రామ్ నందన్ పాత్రలోనూ చక్కగా నటించారు.

అభిరాముడు... అందరివాడేలే!

'రచ్చ' నుంచి 'ఎవడు' వరకు కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేసిన రామ్ చరణ్ నటనలోని కొత్త కోణాన్ని 'గోవిందుడు అందరివాడేలే'తో బయటకు తీశారు కృష్ణవంశీ. ఫ్యామిలీ సీన్స్‌లో నటన, ఆ ఎమోషన్స్ చరణ్ చూపించిన తీరు భలే చూడముచ్చటగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులను ఆయన్ను కొంత దగ్గర చేసిన చిత్రమిది. 'రంగస్థలం' పూర్తిగా దగ్గర చేసింది.

ఆరెంజ్... అది ఒక రేంజ్ అంతే!

'మగధీర' వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత రావడం 'ఆరెంజ్' మీద ఎఫెక్ట్ పడింది. అయితే, తర్వాత తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. అందులో రామ్ చరణ్ చేసిన పాత్రతో ఈతరం యువత ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అందులో ఆయన నటన ఒక రేంజ్ అంతే!

ఐపీఎస్ ధృవ... సెటిల్డ్ పెర్ఫార్మన్స్!

'ధృవ' స్క్రీన్ ప్లే బేస్డ్, హీరో అండ్ విలన్ మధ్య మైండ్ గేమ్‌తో నడిచే సినిమా. ఆ తరహా కథల్లో నటనకు తక్కువ స్కోప్ ఉంటుంది. అరవింద్ స్వామి వంటి నటుడికి ధీటుగా ఐపీఎస్ ధృవ పాత్రలో రామ్ చరణ్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. 

'పెద్ది'... అంచనాలు పెంచుతోంది!

ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా చేస్తున్నారు. 'రంగస్థలం' తర్వాత ఆ స్థాయి క్యారెక్టర్ అంటూ ఆ సినిమాపై ఇప్పటి నుంచి అంచనాలు పెరుగుతున్నాయి.

మెగా ముద్ర నుంచి బయటకు.... గ్లోబల్ స్థాయికి!

'ఆచార్య'లో కాసేపు కనిపించినా... సిద్ధ పాత్రలోనూ రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరిచారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్... 'గ్లోబల్ స్టార్'గా ఎదగడంలో ఈ రోల్స్ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.