సైఫ్ అలీ ఖాన్ ఆగస్టు 16వ తారీఖు 1970లో క్రికెటర్ మన్సూర్ అలీఖాన్, నటి షర్మిలా ఠాగూర్​ దంపతులకు జన్మించాడు.

సజీద్ అలీఖాన్ కొడుకుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సైఫ్ అలీ ఖాన్ 1993లో పరంపర సినిమాతో కెరీర్​ను ప్రారంభించాడు.

అనంతరం నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన యాక్టింగ్​తో ఎందరినో ఆకట్టుకున్నాడు.

దిల్ చాహతా హై, కల్ హో నా హో వంటి సినిమాలతో సైఫ్​కి బాలీవుడ్​లో మంచి గుర్తింపు వచ్చింది.

సినీ కెరీర్ ప్రారంభించకముందే అమృతా సింగ్​ని 1991లో పెళ్లి చేసుకున్నాడు సైఫ్.

అమృతా, సైఫ్​కి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సంతానం. 2004లో సైఫ్ అమృతకు విడాకులిచ్చాడు.

అనంతరం కరీనా కపూర్​తో లవ్​లో పడ్డాడు సైఫ్. బెబోని 2012లో పెళ్లి చేసుకున్నాడు.

సైఫ్, కరీనాకు కూడా ఇద్దరూ సంతానమున్నారు. ఒకరు తైమూర్, మరొకరు జెహ్.

పెళ్లి తర్వాత కూడా సైఫ్, బెబో సినిమాల్లో నటిస్తూ కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా ముందుకు తీసుకెళ్తున్నారు.

తాజాగా ఈ నటుడు తెలుగు ఇండస్ట్రీలోకి కూడా వచ్చాడు. దేవర సినిమాలో విలన్​గా చేసి మంచిగుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్​లో కూడా రావణుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సైఫ్.