తెలుగులో ధనుష్‌కు సక్సెస్ అందించిన సినిమాలు ఏవో తెలుసా?

ఇప్పుడు రజనీకాంత్‌కు ధనుష్ మాజీ అల్లుడు. కానీ, ఫస్ట్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయ్యింది అలాగే!

రజనీ అల్లుడు ట్యాగ్ నుంచి తక్కువ కాలంతో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు ధనుష్.

నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించిన ధనుష్‌కు తెలుగులో సక్సెస్ అందించిన సినిమాలు ఏవో తెలుసా?

తెలుగులో ధనుష్ మొదటి సక్సెస్ 'రఘువరన్ బీటెక్'. భారీ వసూళ్లతో పాటు విమర్శకులను మెప్పించిన చిత్రమిది.

ధనుష్ ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా 'సార్'. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించిన సినిమా.

ధనుష్ దర్శకత్వం వహించిన రెండో సినిమా 'రాయన్'. సిస్టర్ సెంటిమెంట్, రివేంజ్ బేస్డ్ ఫిల్మ్. తెలుగులోనూ హిట్.

'తిరు' పేరుతో తెలుగులో విడుదలైన 'తిరు చిత్రాంబళం' క్లాస్ హిట్ అనిపించుకుంది.

'రఘువరన్ బీటెక్' సీక్వెల్ 'వైఐపీ 2' సైతం మంచి విజయాన్ని నమోదు చేసింది. 

తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదలైంది తమిళ 'కోడి'. ధనుష్ డ్యూయల్ రోల్, త్రిష నెగిటివ్ రోల్ చేసిన చిత్రమిది.

'రౌడీ బేబీ' పాటలో ధనుష్, సాయి పల్లవి స్టెప్స్ మరువగలమా? ఆ సాంగ్ అంత హిట్ కాకున్నా... 'మారి 2' కొందర్ని ఆకట్టుకుంది.

'మారి 2' కంటే ముందు 'మారి'లో 'డాన్ డాన్ డాన్' సాంగ్ హిట్. కాజల్ అగర్వాల్ నటించిన ఆ సినిమా మోస్తరు హిట్ అయ్యింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న 'కుబేర' మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

ధనుష్ దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

'రాయన్' తర్వాత మరోసారి ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఇడ్లీ కడాయ్'. ఏప్రిల్ 10న విడుదల కానుంది.