India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 221 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో భారత్ 136 పరుగులు సాధించింది. 80 పరుగులతో స్మృతి రాణించింది. మరోవైపు, షెఫాలీ వర్మ వరుసగా మూడో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించి 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది.
తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసం సృష్టించడంతో పవర్ ప్లేలోనే స్కోరు 61కి చేరుకుంది. ఆ కాస్త నెమ్మదించిన భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది.
ఆ తర్వాత నుంచి భారత మహిళా బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్నారు. చివరి 10 ఓవర్లలో 136 పరుగులు రాబట్టారు. మంధాన, షెఫాలీ వర్మల మధ్య 162 పరుగుల తొలి వికెట్ ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైంది. మహిళల టీ20 క్రికెట్‌లో మంధాన, వర్మల మధ్య 100 కంటే ఎక్కువ పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నమోదు కావడం ఇది నాలుగోసారి.
నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకపై 221 పరుగులు చేసింది. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో ఇది టీమ్ ఇండియా తరఫున అత్యధిక స్కోరు. అంతకుముందు భారత్ సాధించిన అత్యధిక స్కోరు 217 పరుగులు. ఇది 2024లో వెస్టిండీస్‌పై భారత జట్టు సాధించింది.





















