IPL 2025 Disha Patani Dance Controversy | ఐపీఎల్ వేడుకల్లో దిశా పటానీ డ్యాన్సులపై భారీ ట్రోలింగ్ | ABP Desam
ఐపీఎల్ 2025 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ తో రెండు టీ20 యుద్ధం ప్రారంభం కాగా..ఈసారి జరిగిన ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు మాత్రం ఫ్యాన్స్ ను పూర్తిగా డిజప్పాయింట్ చేశాయి. ప్రధానంగా ప్రతీసారిలా ఈ సారి స్టార్ అట్రాక్షన్ లేకుండానే ఈవెంట్ పెట్టడంపై చాలా మంది ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు. కేకేఆర్ జట్టు ఓనర్ అయిన షారూఖ్ ఖానే యాంకర్ లా మారి ఓపెనింగ్ సెర్మనీ ఈవెంట్ ను రన్ చేశారు. విరాట్ కొహ్లీ, రింకూ సింగ్ లతో తన సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు చేయించారు షారూఖ్. శ్రేయా ఘోషల్ పాడిన వందేమాతరం పాట కాస్త ఆడియెన్స్ కి రిలీఫ్ అని చెప్పాలి. మంచిగా వైబ్ అయ్యారు వందేమాతరానికి స్టేడియం అంతా. అయితే ఆ తర్వాత అరాచకం మొదలైంది. ఏదో క్యాబ్రే డ్యాన్స్ చూడటానికి వచ్చామా అని జనాలు ఫీలయ్యే రేంజ్ లో బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ తో డ్యాన్సులు వేయించారు. అది కూడా బెంగాలీ ఫోక్ సాంగ్స్. ఆ సాంగ్స్ కి ఉండే టెంపో కి సంబంధం లేకుండా అందాచందాల ప్రదర్శనకే ప్రాధాన్యమిస్తూ దిశాపటానీ చేసిన ఈ డ్యాన్సులపై బెంగాలీ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పైగా దిశాపటానీ డ్యాన్స్ ను చాలా చోట్ల జియో హాట్ స్టార్ స్ట్రీమ్ చేయలేదట. మే బీ కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయేమో మ్యూజిక్ తో. అసలు ఛీర్ గర్స్ల్ సంస్కృతికే బైబై చెప్పేసిన ఐపీఎల్ కు..ఈ చెండాలం అవసరం ఏంట్రా అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఏదో ఆర్జిత్ సింగ్ రేంజ్ కాన్సర్ట్ లు ఉంటాయని ఊహించుకుని వచ్చిన ఫ్యాన్స్ కి శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ కాస్త రిలీఫ్ ఇచ్చిన దిశా పటానీ అందచందాల ప్రదర్శనతో క్యాబ్రే డ్యాన్సులు మాత్రం వెగటు పుట్టించాయని తిడుతూ పోస్టులు పెడుతున్నారు.





















