అన్వేషించండి

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?

BRS: కేసీఆర్ కాంగ్రెస్ కూటమి వైపు చూస్తున్నారా? స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి కేటీఆర్ వెళ్లిన వ్యూహం అదేనా ?

KCR: కేసీఆర్ ఎప్పుడూ లేనిది ఇటీవల చంద్రబాబు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన ఎన్డీఏ కూటమిగా తెలంగాణలో అడుగుపెడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. తాను ఒంటరిగానే పోటీ చేస్తానని.. అధికారంలోకి వస్తానని చెబుతున్నారు. అసలు చంద్రబాబు పొత్తులతో పోల్చుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదు. కానీ రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరు అన్నట్లుగా ఆలోచిస్తే.. కేసీఆర్ మాటల్లో లోతైన అర్థం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.                               

కాంగ్రెస్ పార్టీ కూటమికి సన్నిహితమవుతున్న సూచనలు                 

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెన్నైలో నిర్వహించిన సమావేశం తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో కీలకమైన పార్టీ డీఎంకే. ఆ పార్టీ ఓ విధానం తీసుకుని సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కూటమిలోని పార్టీ కాబట్టి కాంగ్రెస్ సీఎం హాజరయ్యారు.  కేటీఆర్ కూడా డీఎంకే నేతలు వచ్చి పిలిచినప్పుడే  వస్తానని చెప్పారు. ఆ ప్రకారం హాజరయ్యారు.  ఈ సమావేశం ఎజెండా బీజేపీని టార్గెట్ చేయడం . అదే జరిగింది బీజేపీ దక్షిణాదికి అన్యాయంచేస్తోందని అందరూ వాదించారు. ఈ వాయిస్ వినిపించిన వారిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఉన్నాయి. 

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్న ఈక్వేషన్                     

చెన్నై సమావేశం తర్వాత తెలంగాణ  సమీకరణాలు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారిలో   రేవంత్, కేటీఆర్ ఉంటారు.  అదే ఫార్ములా తెలంగాణకు అన్వయించేందుకు ఓ అవకాశం ఏర్పడినట్లే .  ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ రాజకీయాలకు ఇదో పునాది అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం  గతంలో బీఆర్ఎస్ ప్రయత్నించిందని స్వయంగా మోదీ చెప్పారు. తాను అవసరం లేదని చెప్పానన్నారు. భవిష్యత్ లోనూ బీఆర్ఎస్ తో పొత్తులు ఉండబోవని చెప్పారు. 

ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి కూటమిగా మారడం తప్పదా ?                     

ఏపీ తరహాలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ఉంటుందన్న ప్రచారం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. టీడీపీ, బీజేపీ తెలంగాణలో కలుస్తాయని అంటున్నారు.  దక్షిణ తెలంగాణలో పట్టు సాధించాలంటే.. టీడీపీ, జనసేనతో కలవడం మంచిదని బీజేపీ హైకమాండ్ అనుకుంటోందని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే అటు ఉత్తర తెలంగాణలో.. ఇటు దక్షిణ తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయన్న ఆందోళన ఉంది.   బీజేపీ కలుపుకునే అవకాశం లేదు కాబట్టి మెల్లగా కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఓ అడుగు చెన్నైలో  పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది ముందు ముందు జరగబోయే పరిణామాలు తదుపరి రాజకీయ దశా, దిశను మార్చే అవకాశం ఉంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget