అన్వేషించండి

Sharmila on Delimitation: సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల

డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజా హక్కుల కోసం చేస్తున్న పోరాటం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. యూపీ సీట్లతో దక్షిణాది సీట్లు సమానం అవుతాయన్నారు.

Delimitation Meeting In Chennai | డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సీట్లను విభజిస్తే కనుక దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం మరింతగా పెరిగి.. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో ఏ పనిలేకుండా పోతుందన్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) ఆధ్వర్యంలో ఎన్డీయేతర విపక్షాల సమావేశం జరుగుతోంది. ఈ కీలక సదస్సుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పంజాబ్, ఒడిశా రాష్ట్రాల విపక్ష నేతలు హాజరై దక్షిణాదికి జరగబోయే అన్యాయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో డిలిమిటేషన్‌పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 

యూపీ సీట్లకు దక్షిణాది 4 రాష్ట్రాల సీట్లు సమానం..

‘అప్పుడు సొమ్ము సౌత్ ది..సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదు. కనుక డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను  అంగీకరించం. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే... దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144 అవుతాయి. ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే ఏకంగా 222 సీట్లు పెరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితం అవుతాం. దక్షిణ భారతదేశానికి  జరిగే అన్యాయం ఇదేనని’ షర్మిల పేర్కొన్నారు.

రాజకీయాలు పక్కన పెట్టాలన్న షర్మిల

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా నియంత ప్రధాని నరేంద్ర మోడీకి బుద్ధి రాదని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మోదీ ఎన్డీయే పక్షం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే అన్నారు. ఇది ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లేనని.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)  సైతం నోరు విప్పకపోవడం మోదీకి పరోక్ష మద్దతు తెలిపినట్లే అన్నారు. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టీ  టీడీపీ, YSRCParty వైసీపీ,  జనసేన పార్టీ (JanaSena Party)లు ముందుకు రావాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Janasena Committee On Balaraju:పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్.. అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం
పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్.. అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget