Cucumber's Summer Health Benefits : వేసవికాలంలో కీరదోసకాయలు తింటే కలిగే లాభాలివే.. డైట్లో చేర్చేసుకోండి
Cucumber in Summer : వేసవికాలంలో హెల్తీగా, హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కొన్ని ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి. వాటిలో కీరదోస ఒకటి. సమ్మర్లో దీనిని తినడం వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.

Health Benefits of Cucumber in Summer : వేసవిలోనే కాకుండా కీరదోసలను చాలామంది రెగ్యులర్‌గా డైట్లో తీసుకుంటారు. జీర్ణసమస్యలను దూరం చేసుకోవడానికి, రిఫ్రెష్‌గా ఫీల్ అవ్వడానికి తింటారు. అయితే వీటిని సమ్మర్లో తింటే వాటి ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి. అందుకే వీటిని డైట్లో చేర్చుకోవాలంటున్నారు. ముఖ్యంగా సమ్మర్లో వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు. ఇంతకీ కీరదోసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో? ఎలాంటి ఫలితాల కోసం వీటిని డైట్లో చేర్చుకోవచ్చో చూసేద్దాం.
వేడిని తగ్గించుకోవడానికి..
సమ్మర్లో కీరదోసకాయలను తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఎండవల్ల శరీరం నుంచి వేడి ఎక్కువగా వస్తుందనుకున్నప్పుడు దీనిని తినొచ్చు. దీనిలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది హైడ్రేషన్‌ను అందించి.. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది.
బరువు తగ్గడానికై..
బరువు తగ్గాలనుకునేవారు.. బరువును కంట్రోల్ చేయాలనుకునేవారు దీనిని డైట్లో తీసుకోవచ్చు. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. పైగా పూర్తిగా అధిక నీటితో నిండి ఉంటాయి. వీటిని తిన్నప్పుడు కడుపు నిండుగా ఉండి.. అన్‌హెల్తీ స్నాక్స్ వైపు మనసు మళ్లకుండా ఉంటుంది.
వడదెబ్బ దూరం..
వేసవిలో వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే వడదెబ్బ సమస్యలు తగ్గుతాయి. దీనిని తినడం వల్ల శరీరం చల్లగా మారి.. వేడి నుంచి రక్షణ అందిస్తుంది.
బీపీ తగ్గుతుంది..
కీరదోసలలో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. బీపీ ఉన్నవారు ఎండల వల్ల ట్రిగర్ అవ్వకుండా, హెల్తీగా ఉండేందుకు వీటిని తినొచ్చు.
గట్ హెల్త్
కీరదోసలలోని అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. మలబద్ధకం సమస్యను తాత్కలికంగానే కాకుండా శాశ్వతంగా పరిష్కరించడంలో హెల్ప్ చేస్తుంది. కడుపును తేలికగా చేస్తుంది.
మైండ్ హెల్త్..
కీరదోసల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఎండవల్ల బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడకుండా కాపాడుతాయి.
స్కిన్ కేర్
కీరదోసలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఎండవల్ల చర్మం డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. ట్యాన్స్ సమస్యల్ని దూరం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి.. తాజా ఫీల్‌ని ఇస్తాయి. అంతేకాకుండా మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. అప్పటికే ఉన్నవాటిని తగ్గిస్తుంది.
కంటికై..
కీరదోసలను చక్రాలుగా కట్ చేసుకుని కళ్లపై పెట్టుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. కళ్లకు హాయిగా కలుగుతుంది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు సూర్యకాంతి వల్ల కళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కీరదోసలను కళ్లపై పెట్టుకోవడం వల్ల రిలాక్స్ అవుతారు.
ఎలా తీసుకోవచ్చంటే..
మీరు కీరదోసలను నేరుగా, హెల్తీ స్నాక్‌గా, క్రంచీ క్రేవింగ్స్ సమయంలో తీసుకోవచ్చు. సలాడ్స్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కూలింగ్ లక్షణాలను మరింత పెంచుకోవడానికి పెరుగులో కలిపి రైతాగా కూడా డైట్లో తీసుకోవచ్చు. శాండ్విచ్లు, మొలకలతో కలిపి తినవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

