అన్వేషించండి

SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam

 60వేల పాటలు పాడిన మహాగాయకుడు...16 భాషల్లో తన స్వర మాధుర్యం వినిపించిన గాన గంధర్వుడు ఆయన...తమిళ వాళ్లు..తెలుగు వాళ్లు..కన్నడ వాళ్లే కాదు యావత్ భారతం అంతా మా బాలు అని పిలుచుకునే ఆధునిక యుగ వాగ్గేయకారుడు. తన అభిమానులని విడిచి 5ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బాలు బతికే ఉన్నాడని భావించే ఆయన అభిమానులకు ఇప్పుడు ఓ వివాదం దిగులు కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో పెట్టతలిచిన బాలు విగ్రహం చుట్టూ ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. ఇది కొంత మంది కావాలనే చేస్తున్నారా...లేదా నిజంగానే యావత్ తెలంగాణ ఇష్యూనా జనరలైజ్ చెప్పట్లేదు కానీ...బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడానికి ససేమిరా అంటున్నారు కొంతమంది. పృథ్వీరాజ్ అనే తెలంగాణ ఉద్యమ కారుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పని చెబుతున్నారు. నేరుగా ఆయన ఎస్పీ బాలు బావగారు, సినీనటుడు అయిన శుభలేఖ సుధాకర్ తో గొడవ పడుతున్న వీడియో వైరల్ గా మారింది. బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించింది సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సాంస్కృతిక తరపున ఓ కమిటిని వేసి దాంట్లో శుభలేఖ సుధాకర్ ని భాగస్వామ్యం చేసింది మంత్రి జూపల్లి కృష్ణారావు.

అసలు వివాదం ఏంటంటే ఎస్పీ బాలు తెలంగాణ వాడా..ఆయన తెలంగాణకు ఏమన్నా చేశాడా...తెలంగాణ వాళ్ల విగ్రహాలు సాంస్కృతిక భవనంలో పెట్టండి పీవీ నరసింహారావు ఉన్నారు..చిత్ర పరిశ్రమలో దేశవ్యాప్తంగా తెలంగాణకు పేరు తీసుకువచ్చిన పైడి జైరాజ్ ఉన్నారు అలాంటి తెలంగాణ వ్యక్తుల, మహనీయుల విగ్రహాలు కాదని తెలంగాణకు సంబంధం లేని ఓ వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడం ఏంటీ పృథ్వీరాజ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. దానికి ఆయన ఉద్యమాన్ని కలిపి మాట్లాడుతున్నారు. ఇది ఆయన వ్యక్తిగతమా లేదా తెలంగాణ లో మేజర్ ప్రజల అభిప్రాయం ఇదేనా విషయం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి...తమిళనాట చదువుకుని...చెన్నైలో సినిమా అవకాశాలు సంపాదించి ఆ భాష ఈ భాష అని లేకుండా 16 భాషల్లో పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు గాంచిన ఎస్పీ బాలును ఓ ప్రాంతానికి అందునా ఆంధ్రా వాడిగా పరిమితం చేయటం సబబా అని బాలు అభిమానులు అడుగుతున్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రగీతంగా ఉన్న జయ జయహే తెలంగాణను పాడాలంటే బాలు తను పాడనని చెప్పారని మరో వివాదాన్ని లేవెనెత్తుతున్నారు. మరి జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి అందెశ్రీనికి గౌరవం అందించిన రేవంత్ రెడ్డి ఈ విషయం తెలియకనే బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టాలని నిర్ణయించుకున్నారా...  సో ప్రభుత్వమే ఈ పని చేస్తున్నప్పుడు శుభలేఖ సుధాకర్ నో, మరొకరినో కార్నర్ చేయటం ఏంటి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలంగాణలోనే మరికొందరు చెబుతున్న అభిప్రాయం. మొత్తంగా ఈనెల 14న బాలు విగ్రహావిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.

తెలంగాణ వీడియోలు

Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
ABP Premium

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Underwater Tunnel In India: నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Embed widget