Health benefits of wine in summer : వైన్ తాగితే ఆడవారికి మంచిదా? మగవారు తాగితే నష్టాలున్నాయా? సమ్మర్లో దీనిని తాగొచ్చా?
Wine Uses : సమ్మర్లో వైన్ తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. అసలు దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Wine Benefits During Summer : సమ్మర్లో చాలామంది చిల్ అయ్యేందుకు బీర్ తీసుకుంటారు. అలాగే పార్టీలు పేరు చెప్పి.. ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయని చెప్పి ఆల్కహాల్‌కి దూరంగా ఉండేవారు వైన్‌ని తీసుకుంటారు. అయితే వైన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పాజిటివ్, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే సమ్మర్లో వైన్ తీసుకుంటే మగవారికి, ఆడవారికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో.. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వైన్ వల్ల కలిగే లాభాలివే..
వైన్‌లో ఇథనాల్ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మెరుగైన విశ్రాంతిని అందించడానికి హెల్ప్ చేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి కణాల నష్టం, వాపు నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తుంది. వైన్ గుండె జబ్బులు, స్ట్రోక్, హృదయ సంబంధ మరణాల ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వైన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు.
సమ్మర్లో వైన్ తీసుకుంటే..
వేసవికాలంలో వైన్ మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. యాంటీఆక్సిడెంట్లు సూర్యుని నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే సన్ డ్యామేజ్‌ని దూరం చేస్తుంది. వేసవిలో వైన్ హృదయనాళలపై వేడివల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే సామాజిక కార్యకలాపాల్లో తీసుకుంటే విశ్రాంతిని ఇస్తుంది.
మగవారికి వైన్‌తో కలిగే లాభాలివే..
వైన్‌ని మితంగా తీసుకుంటే మగవారికి ఆడవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. హృదయనాళాలకు ప్రయోజనాలు అందిస్తుంది. గుండె జబ్బుల ప్రమదాం ఎక్కువగా ఉండేవారు దీనిని మితంగా తీసుకోవచ్చు. వైన్లోని యాంటీఆక్సిడెంట్లు అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.
ఆడవారికి కలిగే బెనిఫిట్స్ ఇవే..
మహిళలు వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందుతాయి. వైన్లోని యాంటీఆక్సిడెంట్లు బోన్ హెల్త్‌ని మెరుగుపరుస్తాయి. మోనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది. హృదయ ఆరోగ్యానికి మంచిది. మోనోపాజ్ తర్వాత వచ్చే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
గుర్తించుకోవాల్సిన విషయాలివే..
వైన్‌ని లిమిట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు అందుతాయి కరెక్టే. అలా అని దానిని ఎక్కువగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది. కొన్ని రకాల క్యాన్సర్లను ఎక్కువ చేస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఇస్తుంది. అయితే ఇది అందరికీ ప్రయోజనాలు అందిస్తుందనుకుంటే పొరపాటే. కానీ ఇది జీవనశైలి, బరువు, ఇతరకారకాలపై ఆధారపడి ఉంటుంది.
వైన్‌ని మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే దీనిని లిమిటెడ్గానే తీసుకోవాలి. వివిధ ప్రయోజనాల కోసం దీనిని తీసుకోవాలనుకుంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే అకేషనల్‌గా తీసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని గుర్తించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

