Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Adani Group: అదాని గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ.. ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఏపీలో పలు పెట్టుబడుల అంశాలపై చర్చించారు.

Gautam Adani meets Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ను అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీల కలిశారు. ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చిన అయన అక్కడి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్‌లో అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించారు. తదుపరి 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో పెడుతుందని ప్రకటించారు. అదే సమయంలో విశాఖలో గూగుల్ ఏఐ హబ్ నిర్మాణంలో అదానీ గ్రూపు పాలు పంచుకుంటోంది. ఈ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.





















