వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
ఏ ఇద్దరు ప్లేయర్లని సీనియర్లైపోయారనే పేరుతో టీమ్‌లో నుంచి తీసేయాలనుకున్నారో.. వాళ్లే ఇప్పుడు జట్టుకు దిక్కయ్యారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసైపోయింది.. టీమ్‌లో నుంచి తీసేయాలి.. వాళ్లిద్దరూ రిటైర్మెంట్ ఇచ్చేయాలి.. అంటూ కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కోచ్ గంభీర్ వీళ్లిద్దరినీ వన్డే ఫార్మాట్ నుంచి కూడా ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అనే ఆలోచనలో ఉన్నాడని చాలామంది చెప్పుకుంటున్నారు కూడా. అయితే ఈ మధ్యనే జరిగిన ఆసీస్‌తో వన్డే సిరీస్ నుంచి రీసెంట్‌గా సఫారీ టీమ్‌తో ఆడిన ఫస్ట్ వన్డేలో కూడా రోకో పరుగుల వరద పారించడంతోనే మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. ఇక ఇంకొన్ని గంటల్లో రెండో వన్డే జరగబోతోంది. ఇలాంటి టైంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. రోకోపై, టీమిండియా సెలెక్టర్లపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరుగులు చేయకపోతే.. టీమ్ఇండియా మ్యాచ్ ఓడిపోతుందని మరోసారి ప్రూవ్ అయింది. ఒకవేళ ఫస్ట్ వన్డేలో మనం 300, 350 పరుగులు చేయకపోయి ఉంటే.. దక్షిణాఫ్రికా కచ్చితంగా గెలిచేసేది. అంటే టీమ్ఇండియా గెలవాలంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కచ్చితంగా రాణించాలన్నమాట. ఇప్పుడంతా యంగ్ క్రికెటర్లే టీమ్‌లో ఉండాలని పెద్ద చర్చ జరుగుతోంది. అందుకే టీమ్‌ని యంగ్ బ్లడ్‌తో నింపేస్తున్నారు. కానీ వారంతా కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోతున్నారు. చివరికి టీమ్‌ఇండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే దిక్కయ్యారు’ అని కైఫ్ అనడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కైఫ్ కామెంట్స్ చూసి రోకో ఫ్యాన్స్ తెగ హ్యాపీ అవుతున్నారు. మరి కైఫ్ కామెంట్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి?




















