Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Hindu gods: పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నడు.. మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Revanth Reddy comments on Hindu gods are causing a stir: హైదరాబాద్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుందన చెప్పే క్రమంలో హిందువులకు ఎన్ని దేవతలు ఉన్నారు..? పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నడు.. మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు" అని వ్యాఖ్యానించారు. గాందీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
హిందూ దేవుళ్ళ పైన రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..
— ManaSarkar (@manasarkar9) December 2, 2025
పెళ్లి కానివారికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునేవారికి ఒక దేవుడు, మందు తాగేవారికి మరో దేవుడు ఉంటారు#RevanthReddy #LatestNews #TelanganaNews pic.twitter.com/gEVJvjKNvO
హిందువులు 3 కోట్ల దేవతలను నమ్ముతారని, అంతమంది దేవుళ్లు ఎందుకు ఉన్నారని ..వివిధ రకాల వ్యక్తులు, సమూహాలకు ప్రత్యేక దేవుళ్లు ఉన్నారని గా అన్నారు. "హిందువులు ఎన్ని దేవతలను నమ్ముతారు? మూడు కోట్లా? అంతమంది దేవుళ్లు ఎందుకు ఉన్నారు? పెళ్లి చేసుకోకుండా ఉండేవారికి హనుమంతుడు ఉన్నాడు. రెండు పెళ్లిళ్లు చేసుకునేవారికి మరొక దేవుడు ఉన్నాడు. మందు తాగేవారికి ఒక దేవుడు ఉన్నాడు. కోడి కోసేవారికి ఎల్లమ్మ, పోచమ్మ, మహిషమ్మ వంటి దేవతలు ఉన్నారు. పప్పన్నం తినేవారికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. ప్రతి గ్రూపుకు తన సొంత దేవుడు ఉన్నాడు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, హిందూ మత విశ్వాసాలను తేలికగా తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలు మతపరమైన భావాలను గాయ పరుస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతూ, తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
🔹హిందూ దేవుళ్ళను అపహాస్యం చేయడం ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది.
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) December 2, 2025
🔹ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా @revanth_anumula రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ పైన కారెడ్డాలాడుతూ మాట్లాడడం దురదృష్టకరం.
🔹ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి… pic.twitter.com/zMGmVBEA4e





















