అన్వేషించండి

Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 

Land acquisition in Amaravati | ఏపీ రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి కోసం మూడో విడత భూ సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి నారాయణ తెలిపారు.

AP Capital Amaravati | అమరావతి: ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ఇదివరకే రెండో విడతలో రైతుల నుంచి 16 వేలకు ఎకరాలకు పైగా భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ మరుసటి రోజే రాజధాని కోసం మూడో విడత ల్యాండ్ పూలింగ్‌ (భూ సమీకరణ)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజధాని కోసం మూడో విడత భూ సేకరణ ఉంటుందని ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తెలిపారు. రెండో విడతలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూడో విడత భూ సమీకరణ అంశంపై త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు. మూడో విడత భూ సేకరణకు సంబంధించిన తుది నిర్ణయం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. తొలి విడతలో రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించగా, ప్రభుత్వ భూములు దాదాపు 16 వేల ఎకరాలు సీఆర్డీఏకు అప్పగించింది.

రాజధానిలో బ్యూటిఫికేషన్‌పై ఫోకస్

అమరావతి రాజధాని నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని అమరావతి సిటీ మొత్తం 227 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని, ఇందులో 30 శాతం ప్రాంతం గ్రీన్ అండ్ బ్లూ ఏరియాగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్ల వెంట బ్యూటిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆయా సీజన్లలో లభించే పూల రకాలను ఉపయోగించి బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని వివరించారు. అదే విధంగా, 22 రోడ్లలో ఇరువైపులా ఉన్న బఫర్ జోన్‌లలో గ్రీనరీని అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి.


Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 

శాఖమూరు పార్క్, బయో  డైవర్సిటీ పార్కులు..
190 ఎకరాల్లో శాఖమూరు పార్క్ సిద్ధమవుతోందని, అలాగే 200 ఎకరాల్లో బయో డైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు, కృష్ణాయపాలెం మరియు నీరుకొండ వద్ద ఉన్న రిజర్వాయర్ల బ్యూటిఫికేషన్ పనులు కూడా జరుగుతున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 

‘శాఖమూరు పార్కులో అమ్యూజ్‌మెంట్ పార్కుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, పిల్లల కోసం స్నో వరల్డ్, అడ్వెంచర్ పార్క్ వంటి విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, ఈ పార్కులో 50 ఎకరాల్లో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరో ముఖ్య ఆకర్షణగా, 20 ఎకరాల విస్తీర్ణంలో దశావతార ఫ్లవర్ గార్డెన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో, సుమారు 30 శాతం ఏరియాలో బ్యూటిఫికేషన్, గార్డెనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని’ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
IndiGo Crisis: ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
Embed widget