హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం హైదరాబాద్ అభిమానులు ఎగబడ్డారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా పంజాబ్‌తో మంగళవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బరోడా, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బరోడా తరఫున హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బరిలోకి దిగగా.. పంజాబ్ తరఫున విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బరిలోకి దిగాడు. ఈ స్టార్ ఆటగాళ్లను చూసేందుకు హైదరాబాద్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తలివచ్చారు. దానికి తోడు ఫ్రీ ఎంట్రీ కావడంతో స్టేడియం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. అయితే ఇంతమంది వస్తారని ఊహించని hca ఆ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయింది. ఇదే అదనుగా తక్కువ సంఖ్యలోనే సెక్యూరిటీ ఉండటంతో వాళ్ళ కళ్లు గప్పి తమ అభిమాన ఆటగాళ్లను కలుసుకునేందుకు అభిమానులు చాలా సార్లు మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు.
కొందరు అభిమానులు మైదానంలోకి పరుగెత్తి హార్దిక్ పాండ్యా కాళ్లు మొక్కడంతో పాటు అతనితో కలిసి సెల్ఫీలు దిగారు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా.. బ్యాటింగ్ చేసేటప్పుడు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా సైతం అభిమానులను వారించకుండా సెల్ఫీలు దిగాడు. వారిని కొట్టవద్దని సెక్యూరిటీకి సూచించాడు. ఈ కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే మొన్న సౌత్ ఆఫ్రికాతో 1st వన్డే టైంలో కూడా కోహ్లీ దగ్గరికి ఓ ఫ్యాన్ ఇలాగే పరిగెత్తుకొచ్చాడు.
ఈ ఇన్సిడెంట్స్ పై ప్రస్తుతం తీవ్రంగా విమర్శలోస్తున్నాయి. మైదానంలోనే ఆటగాళ్లకు భద్రతా లేకపోతే ఎలా? ఇలా పిచ్ invaders ని security ఆపలేకపోతే.. అంటూ కొంతమంది మండిపడుతున్నారు. ‘ఇప్పుడంటే వచ్చింది ఫ్యాన్స్ కాబట్టి సరిపోయింది.. అదే రేపెప్పుడైనా వాళ్లపై దాడి చేయడానికి ఎవరైనా పరిగెత్తుకోస్తే.. వాళ్ళని కూడా ఇలాగే వదిలేస్తారా? అది కోహ్లీ, పాండ్య, రోహిత్.. లాంటి ఆటగాళ్ల ప్రాణాలకే డేంజర్ కాదా? ఇప్పటికైనా స్టేడియాలలో సెక్యూరిటీ టైట్ చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడండి‘ అని కోరుతున్నారు.





















