Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
ఆటలు కూడు పెడతాయా? ఆకలి తీరుస్తాయా? అని ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ ఈ వీడియోలో చెప్పబోయే స్పోర్ట్స్ పర్సన్ స్టోరీ ఓ పెద్ద కనువిప్పుగా నిలుస్తుంది. తినడానికి తిండి లేక.. కట్టుకోవడానికి బట్ట లేక.. ఉండడానికి ఇల్లు కాదు కదా.. కనీసం తనకంటూ ఓ దేశం కూడా లేకుండా.. శరనాణార్థిగా.. పక్క దేశాల పంచన చేరి.. ఆకలి తీర్చుకోవడానికి అడుక్కుని బతుకుతున్నా సరే.. అన్ని కష్టాలను అధిగమించి.. పోరాడి.. గెలిచి.. ప్రపంచమే తనకి దాసోహం అనే ఫుట్ బాల్ స్టార్‌లా ఎదిగాడు. మరి ఆ స్పోర్ట్ స్టార్ ఎవరు? జీవితంతో అతడు చేసిన యుద్ధం ఏంటి? ఫుల్ బాల్ లెజెండ్‌గా ఎలా ఎదిగాడు? పదండి ఈ రోజు స్పోర్ట్స్ టేల్స్‌లో తెలుసుకుందాం.
Alphonso Davies ఫుట్ బాల్ ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు ఓ వండర్. గ్రౌండ్‌లో బుల్లెడ్ స్పీడ్‌దో దూసుకుపోయే ఆల్ఫోన్సో స్పీడ్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్.. అతడికి ముద్దుగా ది రోడ్ రన్నర్ అని పిలుచుకుంటారు. అయితే ఇప్పుడంటే ఆల్ఫాంజో ఓ ఫుట్‌బాల్ స్టార్. కానీ ఈ స్టార్‌డమ్ వెనక ఓ భయంకరమైన చీకటి కోణం కూడా ఉంది.
2000వ సంవత్సరంలో లైబీరియాలో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా డెబెహ్ అండ్ ముస్సా డేవిస్ అనే జంట ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా దేశానికి పారిపోయి వచ్చింది. అదే ఏడాది అక్టోబర్‌లో వీళ్లిద్దరికీ శరణార్థి శిబిరంలోనే అల్ఫోన్జో జన్మించాడు. ఒక దేశం నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులను యూఎస్, యూరప్ దేశాల్లోనే ఎంత గొప్పగా చూస్తారో మనకి తెలుసు. అలాంటిది ఘనా లాంటి పేద దేశంలోని శరణార్థి శిబిరంలో జీవితం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి.
సరిపడా తిండి దొరికేది కాదు. కట్టుకోవడానికి సరిగా బట్టలుండేవి కాదు. పురుగుల కంటే హీనంగా.. దారుణమైన పేదరికంలో ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియకుండానే అల్ఫాన్జో బాల్యం గడిచిపోయింది. ఆల్ఫోన్సోకి ఐదేళ్లు ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీకి కెనడా వలస హోదా ఇస్తూ వాళ్ల దేశానికి తీసుకెళ్లింది. శరణార్థి శిబిరంలో దుర్భరమైన జీవితం నుంచి.. ఒక్కసారిగా కెనడాలోని ఎడ్మంట్ నగరానికి మారడంతో అల్ఫాన్జో లైఫ్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు. ఇక్కడే ఆల్ఫోన్సో తన బాల్యాన్ని చాలా స్వేచ్ఛగా గడిపాడు, ఇక్కడే అతనిలో ఫుట్‌బాల్ అంటే ఇష్టం కూడా పెరిగింది. స్కూల్ అయిపోగానే ప్రతి రోజూ తన ఫ్రెండ్స్‌తో కలిసి.. చాలా ఇష్టంగా ఫుట్‌బాల్ ఆడేవాడు. అలా అల్పాన్జో స్టార్ ఫుట్‌బాలర్ కావడానికి మొదటి పునాది పడింది.
నేచురల్ స్పీడ్ అల్ఫాన్జో సొంతం. ఆ స్పీడ్‌తో పాటు ఎజిలిటీ, ప్యాషన్.. అన్నీ కలిపి కొన్నేళ్లలోనే అల్ఫాన్జోని తన ఏజ్ గ్రూప్‌లో టాప్ ఫుట్‌బాలర్‌ని చేశాయి. అలా అలా లోకల్ ఫుట్‌బాల్ క్లబ్స్‌లో అతడి పేరు వినిపించడం మొదలైంది. అతడిని వాళ్ల క్లబ్‌లో చేర్చుకోవడానికి లోకల్ క్లబ్స్ అన్నీ పోటీ పడ్డాయి. అలా 14ఏళ్ల అతి చిన్న వయసులోనే మేజర్ లీగ్ సాకర్‌లోని వ్యాంకోవర్ వైట్‌క్యాప్స్ అకాడమీలో స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాదు.. అకాడమీలో చేరిన ఏడాదిలోనే.. అంటే 15 ఏళ్ల వయసులోనే వైట్‌క్యాప్స్ సీనియర్ టీంకి సెలక్ట్ అయి.. MLS చరిత్రలో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అల్ఫాన్జో ఆట చూసి.. ప్రేక్షకులే కాదు.. ప్రత్యర్థులు కూడా షాక్ అయ్యేవాళ్లు. గ్రౌండ్‌లో చిరుతలా పరిగెడుతూ.. అపోనెంట్ ప్లేయర్లకి ముచ్చెమటలు పట్టించేవాడు. ఎంతలా అంటే.. అల్ఫాన్జో ఆటకి యూరోపియన్ లెజెండరీ ఫుట్‌బాల్ క్లబ్స్ కూడా ఫిదా అయిపోయాయి. పోటీపడి మరీ తమ క్లబ్ తరపున ఆడాలని ఆఫర్ల వర్షం కురిపించాయి.
యూరోపియన్ క్లబ్స్‌లో చాలా వరకు అల్ఫాన్జో కోసం పోటీ పడినా.. వాటిలో జర్మనీకి చెందిన బేయర్న్ మ్యూనిచ్ క్లబ్‌లో ఆడటానికి అల్ఫాన్జో ఓకే చెప్పడంతో.. ప్రస్తుతం ఆ క్లబ్‌తో పాటు.. కెనడా నేషనల్ టీమ్‌కి కెప్టెన్‌గా ఆడుతున్నాడు. అంతేకాదు.. బేయర్న్ మ్యూనిచ్ జట్టులో లెఫ్ట్ బ్యాక్‌గా ఆడుతూ.. ప్రపంచంలోనే వన ఆఫ్ ది టాప్ లెఫ్ట్ బ్యాక్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 2020లో, బేయర్న్‌తో కలిసి ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలిచి, ప్రపంచం మెచ్చిన ఫుట్‌బాలర్‌గా ఎదగాలనే తన కలని నిజం చేసుకున్నాడు. అంతేకాదు.. 36 సంవత్సరాల తర్వాత కెనడా ఫుట్‌బాల్ టీమ్ ఫస్ట్ 2022 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది కూడా అల్ఫాన్జో కెప్టెన్సీలోనే. ఇది కెనడియన్ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది అండ్ అల్ఫాన్జో డేవీస్‌ని ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాలర్‌ల లిస్ట్‌లోకి చేర్చేసింది.
ఇప్పుడు అల్ఫాన్జో కోటీశ్వరుడు. ఒకప్పుడు ఆకలికి అలమటించిన అల్ఫాన్జోకి ఆటే కూడు పెట్టింది. ఆకలి తీర్చింది. ప్రపంచమే దాసోహమనేలా చేసింది. దీనంతకటికీ కారణం ఓ ఆట. మరిప్పుడు చెప్పండి.. ఆట అన్నం పెడుతుందా? పెట్టదా? ఆకలి తీస్తుందంటారా? లేదా? కామెంట్ చేసి చెప్పండి.





















