అన్వేషించండి
Ram Pothineni: రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన రామ్... భాగ్యశ్రీతో రెండు పాటలు & ఇంకా ఏం చేశారంటే?
Andhra King Thaluka: ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న #RAPO22 రాజమండ్రి షెడ్యూల్ పూర్తి అయ్యింది.

రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన రామ్... భాగ్యశ్రీతో రెండు పాటలు & ఇంకా ఏం చేశారంటే?
1/5

ఉస్తాద్ రామ్ పోతినేని (Ustad Ram Pothineni) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఓ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు పి (Director Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ఈ సినిమా రాజమండ్రి షెడ్యూల్ పూర్తి అయ్యింది.
2/5

హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని #RAPO22 అని సినిమా యూనిట్ వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసింది. రాజమండ్రిలో జరిగిన సెకండ్ షెడ్యూల్‌లో 34 రోజుల పాటు నాన్ స్టాప్‌గా డే అండ్ నైట్ షూట్ చేశారు. ఇందులో రెండు పాటలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్, ఇంపార్టెంట్ టాకీ సీన్స్ కంప్లీట్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను మరింత అందంగా పిక్చరైజ్ చేశారట.
3/5

రాజమండ్రిలో షెడ్యూల్‌లో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే సహా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితర తారాగణం చిత్రీకరణ చేశారు. ఈ నెల (మార్చి) 28న హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
4/5

రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ నూని, సంగీతం: వివేక్ - మెర్విన్, సీఈవో: చెర్రీ.
5/5

'ఆంధ్రా కింగ్ తాలూకా' టైటిల్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాలో సాగర్ రోల్ చేశారు రామ్ పోతినేని.
Published at : 20 Mar 2025 10:27 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion