అన్వేషించండి

KCR Latest News : "ఓడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా ఎక్కడికి రావాలె? మన వల్ల కాలేదని చంద్రబాబు వస్తాడాట"కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR Latest News : ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఎక్కడికి వచ్చేది అని బీఆర్‌ఎస్ అధినేత ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్లు వస్తారని హెచ్చరించారు.

KCR Latest News : ఓడించి ఇంట్లో కూర్చోబెట్టి, కత్తి వేర వాళ్లచేతికి ఇచ్చి యుద్ధం చేయని చెబితే తాను ఏంచేయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. తమ వల్ల కాలేదని ఇప్పుడు చంద్రబాబు కూడా వస్తారని మీడియా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామగుండం బీఆర్‌ఎస్‌ నేతలతో మాట్లాడిన ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ మాట్లాడారో ఇక్క యథాతథంగా చూడొచ్చు

" తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం. ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నం. ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు. అదీ వాళ్లిష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది. ఇన్నాళ్ళు లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చినట్టు..? తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే పాలనా ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణకు సాగునీరు తాగునీరు సమస్య వచ్చింది."

" తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు. గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవు. అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాలను శుద్ధి చేసి మంచినీరుగా వాడుకుంటారు. మద్రాస్‌లో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణ చేపట్టారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పని చేయవలసి ఉంటుంది. అంతేతప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు సాగునీరు తాగునీరు అవసరం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు నీరు అందించాల్సిందే."

"తెలంగాణ రాగానే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం, వ్యవసాయ స్థిరీకరణ కోసం దృష్టి సారించి పటిష్టమైన కార్యాచరణ అమలు చేసింది. రైతాంగ వ్యవసాయ అభివృద్ధి పాలనా ప్రాధాన్యతాంశంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంచుకుంది. అందులో భాగంగా .... ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందించడం. పంట పెట్టుబడి సాయం చేయడం. పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది.అందుచేతనే పదేళ్లపాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించడానికి ఖర్చు అవుతుందని వెనకాడుతున్నది. ఇది సరికాదు."

"ఎప్పుడైనా ప్రభుత్వాలే రైతుల దగ్గర భూమి శిస్తులు వసూలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఉల్టా ప్రభుత్వమే రైతుకు భరోసా కల్పించే విధంగా పంట పెట్టుబడి అందించిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నదా..?  రైతు సంక్షేమం దిశగా కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన ఫలితమే. ఈ పరిస్థితులను తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది ? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలంలో కూడా మత్తడి దునికిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయో.. ప్రజలు అర్థం చేసుకోవాలి."

"పల్లెల నుంచి హైదరాబాదు వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి మన ప్రభుత్వం అండగా నిలిచింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ల ఇండ్లను కూల్చివేస్తున్నది. గోరేటి వెంకన్న లాంటి కవులు రాసిన, గల్లి చిన్నది గరీబోళ్ల కథ పెద్దది వంటి పాటల స్ఫూర్తితో, పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టినం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే....కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రావే... రావే...అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కానీ నన్ను వోడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా.. నేను ఎక్కడికి  రావాలె? కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా అయితది?"

"కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ప్రశాంతంగా బతికినాము అని తెలంగాణ సమాజం భావిస్తున్నది.  ఇప్పుడు తిరిగి మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనై. తెలంగాణకు ఎప్పుడు ఇగ ఇదే లొల్లా..? ప్రశాంతంగా బతుకొద్దా ..? పాదయాత్రలు కాదు మన మనసుతో యాత్రలు చేయాలి బుర్రతో ఆలోచనలు చేయాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్తు తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలి."

"తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటినుంచీ  కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందనే ఆవేదన, వాళ్ళ తెలివి తక్కువతనం చూసి,  ఉద్యమ కాలంలో నేను వాళ్ళను దద్దమ్మలు సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది.?"

"తెలంగాణ సంపద మీద అందరు గుంటనక్కలు మాదిరి కన్నేసి ఉన్నరు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా చేస్తలేరట, మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట, తెలంగాణలో వచ్చేసారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి. అంటే తెలంగాణను తెలియజేయాలని చూసే వాళ్ల పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు."

తెలంగాణను ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటారు. వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసి కుట్రలను పసిగట్టి కాపాడుకోవాలి. ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖపడాల్సి వస్తది."

"ఎనిమిది మంది బిజెపి ఎంపీలను, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే... ఏకానా కూడా పని కాలేదు. తెలంగాణ నుంచి బిఆర్‌ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు కాపాడుకుందుము కదా. మన దగ్గర ఎంపీల బలం ఉంటే, కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి." అని కేసీఆర్ అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Embed widget