Ugadi Rasi Phalalu 2025: ఉగాది పంచాంగం ఏప్రిల్ 2025 to 2026 మార్చి - మకర రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయి!
Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయి...
మకర రాశి ( ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట మొదటి 2 పాదాలు)
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5
ఏప్రియల్ 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశివారికి మంచి ఫలితాలుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నా చివరి నిముషంలో గట్టెక్కేస్తారు. కుజుడి సంచారం వల్ల ఆరోగ్య భంగం, శారీరక శ్రమ, అలసట ఉంటుంది. మాసాంతంలో శుభకార్యాలకు హాజరవుతారు
మే 2025
ఈ నెలలో మకర రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రావాల్సిన బాకీలు చేతికందుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన వ్యవహారాలు సక్సెస్ అవుతాయి.
ఉగాది పంచాంగం 2025 ధనస్సు రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
జూన్ 2025
జూన్ నెల కూడా మకర రాశివారికి అనుకూలమే. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. చేపట్టిన పనులు పూర్తి అవుతాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. నూతన పరియాలు కలిసొస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
జూలై 2025
మకర రాశివారికి జూలై నెలలో కుజుడి ప్రభావంతో అనారోగ్య సమస్యలుంటాయి. చేపట్టిన పనులు నిలిచిపోతాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. పని ఒత్తిడి, పరామర్శలు ఉంటాయి.
ఆగష్టు 2025
ఈ నెల మీకు మంచి ఫలితాలుంటాయి. అన్నిరంగాల వారికి శుభ ఫలితాలుంటాయి. ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొంటారు. వాహనసౌఖ్యం, మిత్రలాభం, బంధుమిత్రులను కలవడం జరుగుతుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు
ఉగాది పంచాంగం 2025 వృశ్చిక వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
సెప్టెంబర్ 2025
గ్రహాల సంచారం ఈ నెలలో మీకు అంత అనుకూలంగా లేవు. ఆందోళనకలిగించే సంఘటనలు జరుగుతాయి. ఆర్దికంగా ఇబ్బందులు తప్పవు. అకాలభోజనం చేయాల్సి వస్తుంది. మాట్లాడితే చాలు విరోధం జరిగిపోతుంది. అపనిందలు పడతారు. వస్తునష్టం ఉంటుంది.
అక్టోబర్ 2025
ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలుంటాయి. వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. నమ్మినవాళ్లే మోసం చేస్తారు. లేనిపోని ఆరోపణలు ఎదుర్కొంటారు. నెలలో ద్వితీయార్థం బాగానే ఉంటుంది.
నవంబర్ 2025
ఈ నెలలో ప్రశాంతత ఉండదు. కోపం పెరుగుతుంది. అందరితోనూ విరోధాలే ఉంటాయి. ఏం మాట్లాడినా వేరేలా అర్థమవుతాయి. ఉద్రేక స్వభావం ప్రభావం మీరు చేయాల్సిన పనులపై పడతుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి.
ఉగాది పంచాంగం 2025 కన్యా రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
డిశంబర్ 2025
బాగానే ఉన్నటు అనిపిస్తుంది కానీ ఎనిమిదో స్థానంలో కుజుడి సంచారం వల్ల చికాకులు తప్పవు. ఆర్థికంగా కుదుటపడతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
జనవరి 2026
ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం మకర రాశివారికి అదిరిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు. ప్రయాణంలో లాభపడతారు. నూతన ఉత్సాహంతో ఉంటారు.
ఫిబ్రవరి 2026
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం మీకు మంచి చేస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. పాత వాహనాలు మారుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలుంటాయి. ఇంట్లో మార్పులుంటాయి. కుజుడి సంచారం వల్ల ఉద్రేకంతో ఉంటారు.
మార్చి 2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఎండింగ్ మకర రాశివారికి మంచి ఫలితాలుంటాయి. ధైర్యంగా దూసుకెళ్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దలను సేవిస్తారు. విద్యార్థులు పరీక్షలు రాస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణంలో చికాకులుంటాయి.
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
ఉగాది పంచాంగం 2025 తులా రాశి వారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

