డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధం
Fair Deleimitation కోసం దక్షణాది నినదిస్తోంది. ఎన్డీయేతర పక్షాలు తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో సమావేశమైయ్యాయి.
రాబోయే నియోజకవర్గాల పునర్విభజన సహేతుకుంగా జరగాలంటూ.. దక్షణాది రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేసే పునర్విభజన తమకు అంగీకారం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి MK Stalinచాలా కాలంగా చెబుతున్నారు. Fair Delimitation కావాలని డిమాండ్ చేస్తూ స్టాలిన్ నేతృత్వంలో ఇవాళ చెన్నైలో దక్షిణాది యుద్దం మొదలైయ్యింది.తమిళనాడు సీఎం, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) అధినేత, శనివారం జరిగే సమావేశానికి దక్షణాది ముఖ్యమంత్రులు, రాజకీయ పక్షాల నేతలతో పాటు.. ఫెయిర్ డీలిమిటేషన్ సమర్థిస్తున్న ఇతర రాజకీయ పక్షాలు ఈ సమావేశానికి హజరైయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సమావేశానికి హాజరయ్యారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో పాటు.. శిరోమణి అకాలీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ భుందర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (కేరళ) ప్రధాన కార్యదర్శి P M A సలాం సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తం 7 రాష్ట్టాల నుండి 14 మంది ప్రతినిధులు ఒక్కటైయ్యారు.





















