అన్వేషించండి

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత

Secunderabad Bonalu | సికింద్రాబాద్ బోనాల జాతర సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆగస్టు 2 నుండి 4 వరకు మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సికింద్రాబాద్ బోనాల సందర్భంగా రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేత.
  • ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఆలయాలు సిద్ధం, భారీగా భక్తుల రాక.
  • శాంతిభద్రతల కోసం భారీ భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు.
  • భక్తుల సౌకర్యార్థం ఆరు క్యూలైన్లు, వైద్య, తాగునీటి సేవలు.

Wine Shops Closed in Secunderabad | హైదరాబాద్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని నగరంలో 2 రోజుల పాటు మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ, లష్కర్ బోనాలు ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

మార్కెట్, గోపాలపురం పీఎస్ పరిధిలో బంద్
ఈ ఆంక్షలు ప్రధానంగా మల్కాజిగిరి జోన్ పరిధిలోని మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో అమల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను నిర్దేశిత సమయంలో పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. బోనాల వేడుక సజావుగా సాగేందుకు మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

అట్టహాసంగా లష్కర్ బోనాల ఏర్పాట్లు
సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు వేళయింది. చారిత్రక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు సికింద్రాబాద్‌లోని ప్రధాన ఆలయాలన్నీ విద్యుత్ దీపాల కాంతులతో, రంగు రంగుల అలంకరణలతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ఆగస్టు 2, 3 తేదీల్లో ఎంతో వైభవంగా జరగనున్న ఈ బోనాలకు సుమారు 25 నుండి 30 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రభుత్వం, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read: Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?

కట్టుదిట్టమైన భద్రత, భక్తులకు మౌలిక వసతులు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచనున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఆరు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 2 బోనాలు సమర్పించే భక్తులకు, రెండు సాధారణ దర్శనాలకు, మరో రెండు వీఐపీ దర్శనాలకు కేటాయించారు. అలాగే, భక్తుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో 5 తాగునీటి కేంద్రాలను, అత్యవసర వైద్య సేవల కోసం వైద్య ఆరోగ్య శాఖ 3 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది.

Frequently Asked Questions

మద్యం దుకాణాలు మూసివేయడానికి గల కారణం ఏమిటి?

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మద్యం దుకాణాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు మూసివేయబడతాయి?

ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసివేయబడతాయి. ఇది 2 రోజుల పాటు అమల్లో ఉంటుంది.

మద్యం విక్రయాలపై ఆంక్షలు ఏ ప్రాంతాలకు వర్తిస్తాయి?

ఈ ఆంక్షలు ప్రధానంగా మల్కాజిగిరి జోన్ పరిధిలోని మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో అమల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయబడతాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Embed widget