అన్వేషించండి

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

ఎంసీసీ NEET UG 2026 Counselling schedule విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 5 నుండి ప్రారంభమవుతాయి, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 12గా నిర్ణయించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఎంసీసీ విడుదల చేసింది.
  • మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 5న ప్రారంభమై 12న ముగుస్తుంది.
  • ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇది నిర్వహించబడుతుంది.
  • అర్హులైన అభ్యర్థులు ఎంసీసీ అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్టర్ చేసుకోవాలి.

NEET UG Counselling 2026 schedule | మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ తాజాగా విడుదల చేసింది. ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి రౌండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 5 న ప్రారంభమవుతాయి, కాగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 12తో ముగస్తుందని నిర్ణయించారు. ఈ కౌన్సెలింగ్ 15 శాతం ఆల్ ఇండియా కోటా, ఎంసీసీ పరిధిలోకి వచ్చే ఇతర సీట్లలో ఎంబీబీఎస్, బీడీఎస్ (BDS), బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్నారు. నీట్ యూజీ అభ్యర్థులు ఆగస్టు 5 నుండి ఎంసీసీ అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని ఎంసీసీ స్పష్టం చేసింది.

నీట్ యుజి కౌన్సెలింగ్ షెడ్యూల్ 

రౌండ్-1:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 5 ఆగస్టు 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12 ఆగస్టు 2026

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: 17 ఆగస్టు 2026

రౌండ్-2:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25 ఆగస్టు 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 29 ఆగస్టు 2026 (మధ్యాహ్నం 03:00 గంటల వరకు)

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: 02 సెప్టెంబర్ 2026

రౌండ్-3:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 11 సెప్టెంబర్ 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15 సెప్టెంబర్ 2026 (మధ్యాహ్నం 03:00 గంటల వరకు)

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: 18 సెప్టెంబర్ 2026

ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28 సెప్టెంబర్ 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026 (మధ్యాహ్నం 03:00 గంటల వరకు)

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: ఇంకా నిర్ణయించలేదు

Also Read: Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్

కౌన్సెలింగ్‌కు ఎవరెవరు హాజరుకావచ్చు 
నీట్ యుజి 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఎంబీబీఎస్, బీడీఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్‌ (Bsc Nursing)లో ప్రవేశానికి నిర్ణీత అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సంబంధిత కోర్సు కోసం నిర్ణయించిన క్వాలిఫైయింగ్ పర్సంటైల్, ఇతర ఎంట్రన్స్ నిబంధనలు పాటించడంతో పాటు నిర్ణీత సమయంలోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఎంసీసీ పేర్కొంది. రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ అథారిటీ పోర్టల్‌లో విడిగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు ఎంసీసీ స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం
-  అభ్యర్థులు ముందుగా ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in https://mcc.nic.in/ కి వెళ్లాలి.
-  ఆ తర్వాత నీట్ యుజి కౌన్సెలింగ్ 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
-   మీ NEET UG దరఖాస్తు వివరాలతో లాగిన్ అయి, కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి.
-  ఆ తర్వాత వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
-  అనంతరం డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, మీ ప్రాధాన్యత క్రమంలో కాలేజీలు, కోర్సులను ఎంచుకోవాలి.
- అన్ని ఆప్షన్లను జాగ్రత్తగా నింపిన తర్వాత, చివరి తేదీకి ముందే వాటిని లాక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

కౌన్సెలింగ్ కోసం ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం?
అభ్యర్థులు కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియ సమయంలో నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్, అడ్మిట్ కార్డ్, 10వ తరగతి మార్క్‌షీట్, 12వ తరగతి మార్క్‌షీట్, పాస్ సర్టిఫికేట్స్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రిజర్వేషన్ సర్టిఫికేట్, పిడబ్ల్యూబిడి సర్టిఫికేట్, స్థానికత సర్టిఫికేట్, ఎంసీసీ లేదా సంబంధిత సంస్థ కోరిన ఇతర డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి. కాలేజీలో చేరే సమయంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి.

సీట్ అలాట్‌మెంట్‌కు ముందు ఏం జరుగుతుంది?
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, అభ్యర్థులకు కాలేజీలు, కోర్సుల ఆప్షన్లను నమోదు చేయడానికి (చాయిస్ ఫిల్లింగ్), వాటిని లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ల ఆర్డర్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తారు. కనుక వాటిని ఆలోచించి నింపాలి. చాయిస్ ఫిల్లింగ్ పూర్తయ్యాక, ఎంసీసీ అభ్యర్థుల నీట్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్ నిబంధనలు, సీట్ల లభ్యత, నమోదు చేసిన ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తవుతుంది. 

 

Frequently Asked Questions

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఎవరు విడుదల చేశారు?

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 12తో ముగుస్తాయి.

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ ద్వారా ఏ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు?

ఈ కౌన్సెలింగ్ ద్వారా 15 శాతం ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. MCC పరిధిలోని ఇతర సీట్లకు కూడా ఇది వర్తిస్తుంది.

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్‌కు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

అభ్యర్థులు MCC అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ mcc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?

నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్, అడ్మిట్ కార్డ్, 10వ, 12వ తరగతి మార్క్ షీట్లు, ఫోటో ఐడీ, రిజర్వేషన్ సర్టిఫికేట్ వంటివి అవసరం. కాలేజీలో చేరేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget